ఈ షేర్‌లో రూ.10,000 పెట్టుబడి పెట్టినవారికి.. లక్షల్లో లాభం.. మీరూ ఓసారి చూడండి!-share market penny stock sri adhikari brothers television share value 1 rupee to 245 rupees in 1 year ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ షేర్‌లో రూ.10,000 పెట్టుబడి పెట్టినవారికి.. లక్షల్లో లాభం.. మీరూ ఓసారి చూడండి!

ఈ షేర్‌లో రూ.10,000 పెట్టుబడి పెట్టినవారికి.. లక్షల్లో లాభం.. మీరూ ఓసారి చూడండి!

Anand Sai HT Telugu
Jun 30, 2024 01:59 PM IST

Stock Market : కొన్ని రకాల స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన కొంతకాలానికే ఊహించని లాభాలు తెచ్చి పెడుతుంటాయి. అలాంటిదే శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ షేర్. ఇందులో ఏడాది కిందట వేలల్లో పెట్టుబడి పెట్టినవారు ఇప్పుడు లక్షల్లో లాభాలు చూస్తున్నారు.

ఏడాదిలో భారీగా పెరిగిన షేర్ ధర
ఏడాదిలో భారీగా పెరిగిన షేర్ ధర

Sri Adhikari Brothers Television Share Value : ఎంటర్ టైన్ మెంట్ సెక్టార్ కంపెనీ శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్ వర్క్ లిమిటెడ్ స్టాక్ గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను తెచ్చింది. 11 నెలల క్రితం అంటే 2023 జూలైలో ఈ షేర్ రూ.1.26 వద్ద ఉంది. ప్రస్తుతం షేరు ధర రూ.245.55 వద్ద కొనసాగుతోంది.

అంటే 11 నెలల్లో షేర్ ధర రూ.240కి పైగా పెరిగింది. ఇది 16,545శాతం లేదా స్టాక్ కంటే 170 రెట్లు ఎక్కువ రాబడిని అందించిందన్నమాట. 6 నెలల్లో స్టాక్ ఇచ్చిన రాబడులను పరిశీలిస్తే, స్టాక్ 9,000 శాతానికి పైగా లాభపడింది. 2024లో వార్షిక వృద్ధి 8000 శాతానికి పైగా ఉంది. ఏడాది క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో ఇన్వెస్ట్ రూ.10,000 చేస్తే.. నేడు రూ.20 లక్షలకుపైగా చేరేది. శుక్రవారం షేర్ ధర రూ.245.55గా ఉంది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఈ స్టాక్ 2 శాతం పెరిగింది.

షేర్ హోల్డింగ్ సరళి గురించి మాట్లాడితే, ప్రమోటర్లు శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్లో 59.52 శాతం వాటాను కలిగి ఉన్నారు. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 40.48 శాతంగా ఉంది. ప్రమోటర్లలో అత్యధిక వాటాను రువాని మీడియా సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కలిగి ఉంది. ఇది 59.12 శాతం లేదా 1,50,00,000 షేర్లకు సమానం. వ్యక్తిగత ప్రమోటర్లలో విందూ రామన్, హీరా నవనీత్ లాల్ అధికారి, మార్కండ్ నవనీత్ లాల్ అధికారి ఉన్నారు. అయితే వీరికి స్వల్ప వాటాలు ఉన్నాయి.

శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్ వర్క్ షేర్లు అడ్వాన్స్ డ్ సర్వైలెన్స్ మెజర్స్ (ఈఎస్ఎం) స్టేజ్ 2లో ఉన్నాయి. ఈఎస్ఎం ఫ్రేమ్ వర్క్ కింద ట్రేడ్-టు-ట్రేడ్ మెకానిజం కింద షేర్ల ట్రేడింగ్ జరుగుతుంది. పెట్టుబడిదారులకు రక్షణ పెంచడం దీని ఉద్దేశం. స్టాక్స్ భారీ హెచ్చుతగ్గులను చూసినప్పుడు ఇది అమలు చేస్తారు.

WhatsApp channel