బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కందేరేకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇది కూడా కళ్యాణ్ జ్యువెల్లర్స్‌కు చెందిన సంస్థ. ఇది ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా షారూఖ్ ఖాన్‌ను ప్రకటించింది. అతడికి బ్రాండ్‌లో ఎలాంటి వాటా లేదన్న విషయాన్ని కంపెనీ స్పష్టంగా తెలియజేసింది. భారత జ్యూవెలరీ రంగంలో ఇది ఒక కీలక మలుపుగా కంపెనీ పేర్కొంది. భారతీయ బ్రాండ్ స్టోరీటెల్లింగ్‌లోనూ ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తోందని చెప్పింది.
అయితే కంపెనీ ఈ ఊహాగానాలను తక్షణమే ఖండించింది. 'షారూఖ్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే, ఆయనకు ఎలాంటి వాటా లేదు.' అని కందేరే స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో కళ్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్ ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ ఫ్యామిలీలోకి చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన కల్యాణ్ బ్రాండ్‌కు అమితాబ్ బచ్చన్, మరొకవైపు యువతను ఆకర్షించే ఆధునిక ఆభరణాల బ్రాండ్ అయిన కందేరేకు షారూఖ్ ఖాన్ ప్రచారకర్తలుగా ఉన్నారు.
కందేరే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75కి పైగా రిటైల్ స్టోర్లతో ఓమ్ని-చానల్ జ్యూవెలరీ బ్రాండ్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఉండే, డిజైన్, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఆభరణాలు తయారు చేస్తుంది. ఇందులో రోజూ ధరించగలిగే విలాసవంతమైన ఆభరణాలు కూడా ఉంటాయి.
మార్కెటింగ్ వ్యూహంపరంగా చూస్తే ఈ ఇద్దరు టాప్ సెలబ్రిటీలతో ప్రచారం తెలివైన చర్యగా చెబుతారు. అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ కళ్యాణ్ గ్రూప్‌నకు చెందిన బ్రాండ్స్ ప్రమోట్ చేయడం కంపెనీకి కలిసి వచ్చే అంశం.