Multibagger IPO: ఐదేళ్లలో ఐదింతలు.. సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్ సత్తా ఇదీ
Multibagger IPO: సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్ మల్టీబ్యాగర్ ఐపీవోగా నిలిచింది. ఐదేళ్లలో ఐదు రెట్ల లాభాలు ఇచ్చింది.
Multibagger IPO: సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ మల్టీబ్యాగర్ ఐపీవోగా నిలిచింది. ఆగస్టు 2017లో రూ. 31 ప్రైస్ బ్యాండ్ వద్ద వచ్చిన ఐపీవో మదుపరులకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
ఒకవేళ ఈ ఐపీవోలో స్టాక్స్ కొనుగోలు చేసి తమ పెట్టుబడిని అలాగే కొనసాగించిన మదుపరులకు భారీ లాభాలు వచ్చి ఉండేవి. రూ. 1.24 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ మొత్తం రూ. 6.76 లక్షలు అయి ఉండేది. అంటే దాదాపు ఈ ఐదేళ్లలో 450 శాతం రాబడి దక్కినట్టు లెక్క.
Servotech Power Systems bags BPCL order: బీపీసీఎల్ నుంచి ఆర్డర్
ఈ చిన్న కంపెనీ సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్ స్టాక్ నేడు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నుంచి రూ. 46.2 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందడమే ఇందుకు కారణం. తాజాగా సెబీకి దాఖలు చేసిన ఫైలింగ్‌లో ఈ సంగతి తెలిపింది. బీపీసీఎల్ నుంచి 800 యూనిట్లు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ సరఫరా చేసి ఇన్‌స్టాల్ చేసేందుకు ఆర్డరు పొందినట్టు తెలిపింది. రానున్న 4 నెలల్లో దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో ఆ పని చేపడుతుంది.
‘ఈ ప్రాజెక్టులో భాగంగా బీపీసీఎల్ రీటైల్ సైట్లు, ఫ్యుయల్, గ్యాస్ స్టేషన్లలో సెర్వోటెక్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ల ఇన్‌స్టలేషన్, కమిషనింగ్, మెయింటేన్స్ పనులు చేపడుతుంది. తద్వారా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు ఛార్జింగ్ చేసుకునేందుకు ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తాయి..’ అని కంపెనీ తెలిపింది. మొత్తం 46.2 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మార్చి 31 కల్లా పూర్తవుతుంది.
Servotech Power Systems share price history: షేర్ ప్రైస్ హిస్టరీ
సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్ గడిచిన ఆరు నెలల్లో ఈ ఎస్ఎంఈ స్టాక్ రెండింతలైంది. రూ. 85లుగా ఉన్న షేరు ధర ఇప్పుడు రూ. 169 అయ్యింది. ఇండియన్ స్టాక్ మార్కెట్లలో ఇదొక మల్టీబ్యాగర్ స్టాక్‌గా నిలిచింది. 2022లో దాదాపు 110 శాతం రాబడి ఇచ్చింది.
Multibagger IPO: రూ. 31 నుంచి రూ. 169కి
సెర్వోటెక్ పవర్ సిస్టమ్స్ ఐపీవో మల్టీబ్యాగర్‌గా నిలిచింది. రూ. 31 వద్ద ఎంట్రీ ఇచ్చిన ఈ స్టాక్ ఇప్పుడు రూ. 169గా ఉంది. గత ఐదేళ్లలో ఇది 450 శాతం రాబడి ఇచ్చి ఐపీవో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చింది.