Stock market today: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండుగ రోజు; ఒక్క రోజే పెరిగిన రూ. 10 లక్షల కోట్ల సంపద-sensex surges 2 percent investors earn 10l crore rupees key highlights of stock market today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Today: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండుగ రోజు; ఒక్క రోజే పెరిగిన రూ. 10 లక్షల కోట్ల సంపద

Stock market today: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండుగ రోజు; ఒక్క రోజే పెరిగిన రూ. 10 లక్షల కోట్ల సంపద

Sudarshan V HT Telugu

Stock market today: ఈ రోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది. సెన్సెక్స్ 1,578 పాయింట్లు లేదా 2.10 శాతం లాభంతో 76,734.89 వద్ద ముగియగా, నిఫ్టీ 500 పాయింట్లు లేదా 2.19 శాతం లాభంతో 23,328.55 వద్ద ముగిసింది.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు పండుగ

Stock market today: సానుకూల అంతర్జాతీయ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండవ సెషన్ లో మంచి లాభాలను నమోదు చేసింది. బెంచ్మార్క్ లైన సెన్సెక్స్, నిఫ్టీ 50 వరుసగా 76,700 మరియు 23,300 మార్క్ లను అధిగమించాయి. సెన్సెక్స్ 1,578 పాయింట్లు లేదా 2.10 శాతం లాభంతో 76,734.89 వద్ద, నిఫ్టీ 500 పాయింట్లు లేదా 2.19 శాతం లాభంతో 23,328.55 వద్ద ముగిశాయి. అస్థిరత సూచీ ఇండియా వీఐఎక్స్ దాదాపు 20 శాతం క్షీణించి 16 స్థాయికి చేరుకుంది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.02 శాతం, 3.21 శాతం లాభపడ్డాయి.

ఇన్వెస్టర్లకు రూ. 10 లక్షల కోట్ల లాభం

మంగళవారం స్టాక్ మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 10 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 402 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ.412 లక్షల కోట్లకు పెరగింది. దాంతో ఇన్వెస్టర్లు ఒకే సెషన్ లో రూ.10 లక్షల కోట్లు ఆర్జించారు. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ 3.9 శాతం, నిఫ్టీ 50 4.1 శాతం పెరగడంతో, ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.18 లక్షల కోట్ల మేర పెరిగింది.

భారత స్టాక్ మార్కెట్: కీలకాంశాలు

ఈ రోజు స్టాక్ మార్కెట్ లోని కీలకాంశాలను పరిశీలిద్దాం.

1. భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో సెషన్లో ఎందుకు పెరిగింది?

వాణిజ్య యుద్ధ భయాందోళనలు తగ్గుముఖం పట్టడం, ట్రంప్ సుంకాల వల్ల భారత్ పై పెద్దగా ప్రభావం ఉండదన్న నమ్మకం పెరగడంతో వరుసగా రెండో సెషన్ లోనూ మంచి లాభాలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల అమలుకు 90 రోజుల విరామం ప్రకటించారు. అంతేకాకుండా అమెరికాతో వాణిజ్య సరళీకరణ మార్గాన్ని అనుసరించాలని భారత్ నిర్ణయించినట్లు సమాచారం. అమెరికాతో వాణిజ్య సరళీకరణ మార్గంలో వెళ్లాలని భారత్ నిర్ణయించిందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ మీడియాకు తెలిపారు. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు ఈ నెలలో వర్చువల్ చర్చలు ప్రారంభిస్తాయి. తదుపరి రౌండ్ వ్యక్తిగత చర్చలు మే మధ్యలో జరగనున్నాయి. దీనికి తోడు మరిన్ని రేట్ల కోతలు, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఆరోగ్యకరమైన కార్పొరేట్ రాబడుల సీజన్ ఆశలు కూడా మార్కెట్ సెంటిమెంట్ కు ఊతమిస్తున్నాయి.

2. ఒక నిఫ్టీ 50 స్టాక్ మాత్రమే రెడ్ లో

నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఐటీసీ మాత్రమే నష్టాల్లో (0.28 శాతం నష్టం) ముగిసింది. ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్ ఈ రోజుతో గత మూడు రోజుల విజయపరంపరను ముగించింది. అయితే, మార్చిలో 4 శాతం లాభపడిన తర్వాత ప్రస్తుత నెలలో ఇది ఇంకా 3 శాతం పెరిగింది.

3. టాప్ నిఫ్టీ 50 గెయినర్స్

ఈ రోజు నిఫ్టీ 50 లో ఇండస్ఇండ్ బ్యాంక్ (6.67 శాతం), శ్రీరామ్ ఫైనాన్స్ (5.17 శాతం), టాటా మోటార్స్ (4.61 శాతం) షేర్లు టాప్ గెయినర్స్ గా ముగిశాయి.

4. సెక్టోరల్ ఇండెక్స్ లు నేడు

అన్ని ప్రధాన సెక్టోరల్ ఇండెక్స్ లు లాభాల్లో ముగియగా, నిఫ్టీ రియల్టీ (5.64 శాతం) టాప్ గెయినర్ గా ముగిసింది. నిఫ్టీ ఆటో (3.39 శాతం), మెటల్ (3.20 శాతం), మీడియా (2.97 శాతం), ఫైనాన్షియల్ సర్వీసెస్ (2.95 శాతం), ప్రైవేట్ బ్యాంక్ (2.82 శాతం) కూడా బలమైన లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీ బ్యాంక్ 2.70 శాతం లాభపడింది.

5. వాల్యూమ్ పరంగా మోస్ట్ యాక్టివ్ స్టాక్స్

ఎన్ఎస్ఈ డేటా ప్రకారం వొడాఫోన్ ఐడియా (49.5 కోట్ల షేర్లు), ఈజీ ట్రిప్ ప్లానర్స్ (10.9 కోట్ల షేర్లు), జైప్రకాశ్ పవర్ వెంచర్స్ (6.4 కోట్ల షేర్లు), యెస్ బ్యాంక్ (6.13 కోట్ల షేర్లు) వాల్యూమ్ పరంగా అత్యంత చురుకైన స్టాక్స్ గా నిలిచాయి.

6. 52 వారాల గరిష్టాన్ని తాకిన స్టాక్స్

బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), కోరమాండల్ ఇంటర్నేషనల్ వంటి 91 షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్టాన్ని తాకాయి.

7. 52 వారాల కనిష్టాన్ని తాకిన షేర్లు

ఈ రోజు 52 వారాల కనిష్టాన్ని తాకిన 49 స్టాక్స్ లో షీలా ఫోమ్, ఆర్టెమిస్ ఎలక్ట్రికల్స్ అండ్ ప్రాజెక్ట్స్, సలోనా కాట్ స్పిన్ వంటివి ఉన్నాయి.

8. బీఎస్ఈలో 20% పైగా పెరిగిన స్టాక్స్

ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, పాండీ ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్, ఐమ్కో ఎలెకాన్ (ఇండియా), ఎంబీ ఇండస్ట్రీస్, ది ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, గోపాల్ ఐరన్ అండ్ స్టీల్స్ కంపెనీ గుజరాత్, రామా ఫాస్పేట్స్, సీ టీవీ నెట్వర్క్, అమీన్ టానరీ షేర్లు 20 శాతం పైగా పెరిగాయి.

సూచన: కథ విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. పై అభిప్రాయాలు మరియు సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హెచ్ టీ తెలుగు వి కాదు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము. ఎందుకంటే మార్కెట్ పరిస్థితులు వేగంగా మారవచ్చు.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.