Independence Day: లాస్ట్ ఇండిపెండెన్స్ డే నుంచి 10 శాతం పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ.. నెక్స్ట్ ఏంటి..?
Independence Day: జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నా భారతీయ స్టాక మార్కెట్లు అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నాయి. గత సంవత్సరం కాలంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు 10% వృద్ధిని నమోదు చేశాయి.
Independence Day: జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నా భారతీయ స్టాక్ మార్కెట్లు అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతున్నాయి. గత సంవత్సరం కాలంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్ (sensex), నిఫ్టీ (nifty)లు 10% వృద్ధిని నమోదు చేశాయి.

ఎన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నా..
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వడ్డీ రేట్ల పెంపు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, ఉద్యోగుల లే ఆఫ్ లు.. వంటి ఎన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నా.. భారతీయ స్టాక్ మార్కెట్లు ముందుకు దూసుకుపోతున్నాయి. గత సంవత్సరం కాలంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు 10% వృద్ధిని నమోదు చేశాయి. అంతేకాదు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 23% వృద్ధిని, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 24% వృద్ధిని నమోదు చేశాయి.
ఇతర సూచీలు..
రంగాల వారీగా సూచీల పనితీరును పరిశీలిస్తే, గత సంవత్సరం కాలంలో నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ (Nifty PSU Bank) సూచీ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. గత స్వాతంత్య్ర దినోత్సవం నుంచి పీఎస్యూ బ్యాంక్ (Nifty PSU Bank) సాధించిన ప్రగతి 57%. ఆ తరువాత స్థానంలో నిఫ్టీ ఎఫ్ఎంసీజీ (Nifty FMCG) ఉంది. ఇది 22% వృద్ధిని నమోదు చేసింది. ఆ తరువాత, నిఫ్టీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ (19.41%), నిఫ్టీ రియాల్టీ (19.04%), నిఫ్టీ ఫార్మా (18.98%) ఉన్నాయి. మరోవైపు, నిఫ్టీ ఎనర్జీ () 2. 9%, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 2.13% నష్టపోయాయి. నిఫ్టీ 50 స్టాక్స్ లో 24 స్టాక్స్ 20 శాతానికి పైగా ప్రగతిని సాధించాయి. వాటిలో ఐటీసీ () 46% వృద్ధితో తొలిస్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో ఎల్ అండ్ టీ (44%), డాక్టర్ రెడ్డీస్ (37%), ఎన్టీపీసీ (34%) ఉన్నాయి. మరోవైను, యూపీఎల్ అత్యధికంగా 25%, ఆదానీ ఎంటర్ ప్రైజెస్ 14%, ఇన్ఫోసిస్ 13% నష్టపోయాయి.