stock market today: వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్-sensex nifty extend fall into second consecutive session fed meet outcome eyed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Today: వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

stock market today: వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

HT Telugu Desk HT Telugu
Jun 09, 2023 04:25 PM IST

భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ, సెన్సెక్స్ లు నష్టాల్లో ముగియడం వరుసగా ఇది రెండో రోజు. శుక్రవారం సెన్సెక్స్ 223 పాయింట్లను, నిఫ్టీ 71 పాయింట్లను కోల్పోయింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

భారతీయ స్టాక్ మార్కెట్ (stock market) శుక్రవారం నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ, సెన్సెక్స్ లు నష్టాల్లో ముగియడం వరుసగా ఇది రెండో రోజు. శుక్రవారం సెన్సెక్స్ 223 పాయింట్లను, నిఫ్టీ 71 పాయింట్లను కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, వచ్చేవారం ద్రవ్బోల్బణ వివరాల వెల్లడితో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రకటించనుందన్న వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఆచితూచీ సాగాయి. దాంతో, సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్పంగా నష్టపోయాయి.

సెన్సెక్స్, నిఫ్టీ..

బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం 223 పాయింట్లు లేదా 0.35% నష్టపోయింది. చివరకు 62,625.63 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ 71 పాయింట్లు లేదా 0.38% నష్టపోయి, 18,563.40 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే అంచనాను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కెనడా సెంట్రల్ బ్యాంక్ అకస్మాత్తుగా వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో, వడ్డీ రేట్ల పెంపు కొనసాగనుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. బుధవారం కెనడా వడ్డీ రేటును 4.75 శాతానికి పెంచింది. ఇది గత 22 ఏళ్లలో గరిష్టం.

ఆర్బీఐ రెపో..

కాగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గురువారం పాలసీ రేట్లను ప్రకటించింది. రెపో రేటులో ఏ మార్పు చేయలేదు. ఇప్పటివరకు ఉన్న 6.5 శాతాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యలు, యూఎస్ ఫెడ్ రేట్స్ అంచనాలు భారతీయ స్టాక్ మార్కెట్లపై శుక్రవారం కొంత ప్రతికూల ప్రభావం చూపాయి.

స్టాక్స్ లాభనష్టాలు..

కాగా, శుక్రవారం దాదాపు 170 స్టాక్స్ శుక్రవారం తమ 52 వారాల గరిష్టానికి చేరడం విశేషం. ఆ స్టాక్స్ లో యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఇండిగో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐఓసీ, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి సంస్థలున్నాయి. మరోవైపు నిఫ్టీలోని 50 స్టాక్స్ లో 30 నష్టాలతో ముగిశాయి. వాటిలో అత్యధికంగా నష్టపోయినవి హీరో మోటో కార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివిస్ ల్యాబ్స్. మరోవైపు, ఇండస్ ఇండ్ బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ శుక్రవారం మంచి లాభాలను సాధించాయి.

Whats_app_banner