SN Subrahmanyan : ‘ఆదివారాలు కూడా పనిచేయండి’ అన్న ఎల్​ అండ్​ టీ ఛైర్మన్​ జీతం ఎంతో తెలుసా?-see l t chairman sn subrahmanyan salary who called for 90 hours work week ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sn Subrahmanyan : ‘ఆదివారాలు కూడా పనిచేయండి’ అన్న ఎల్​ అండ్​ టీ ఛైర్మన్​ జీతం ఎంతో తెలుసా?

SN Subrahmanyan : ‘ఆదివారాలు కూడా పనిచేయండి’ అన్న ఎల్​ అండ్​ టీ ఛైర్మన్​ జీతం ఎంతో తెలుసా?

Sharath Chitturi HT Telugu
Jan 10, 2025 06:40 AM IST

90 hours work week : ఆదివారాలు కూడా పనిచేయండి అన్న ఎల్​ అండ్​ టీ ఛైర్మన్​ సుబ్రమణ్యన్​ జీతం ఎంతో తెలుసా? రీటైర్మెంట్​ బెనిఫిట్స్​ కింద ఆయనకు ఎంత వస్తోందా తెలుసా? పూర్తి వివరాలు..

ఎల్​ అండ్​ టీ ఛైర్మన్​ ఎస్​ఎన్​ సుబ్రమణ్యన్​
ఎల్​ అండ్​ టీ ఛైర్మన్​ ఎస్​ఎన్​ సుబ్రమణ్యన్​

"భార్య ముఖం ఎంత సేపు చూస్తారు? ఆదివారాలు కూడా పనిచేయండి," అంటూ ఎల్​ అండ్​ టీ ఛైర్మన్​ ఎస్​ఎన్​ సుబ్రమణ్యన్​ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారాయి. వర్క్​-లైఫ్​ బ్యాలెన్స్​పై సోషల్​ మీడియాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. వీటి మధ్య.. సుబ్రమణ్యన్​ జీతానికి సంబంధించిన వార్త కూడా వైరల్​గా మారింది. ఎల్​ అండ్​ టీ ఛైర్మన్​గా సుబ్రమణ్యన్​ ఎంత వేతం పొందుతున్నారో మీకు తెలుసా?

yearly horoscope entry point

సుబ్రమణ్యన్ అసలేం అన్నారు?

'90 గంటల పని' గురించి సుబ్రమణ్యన్ మాట్లాడిన వీడియో ఒకటి రెడ్డిట్​లో వైరల్​ అయ్యింది.

"ఉద్యోగులని ఆదివారాలు కూడా పనిచేయించలేకపోవడం నాకు బాధగా ఉంది. మిమ్మల్ని ఆదివారాలు కూడా పనిచేయిస్తే నేను సంతోషంగా ఉంటాను. ఎందుకంటే, నేను కూడా ఆదివారాలు పనిచేస్తాను," అని సుబ్రమణ్యన్ అన్నారు.

"ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? ఎంతసేపని మీ భార్య ముఖం చూస్తూ కూర్చుంటారు? ఆఫీస్​కి రండి, పని చేయండి," అని ఎల్​ అండ్​ టీ ఛైర్మన్​ సుబ్రమణ్యన్ తెలిపారు.

ఎస్​ఎన్​ సుబ్రమణ్యన్​ జీతం ఎంతంటే..

దిగ్గజ నిర్మాణ సంస్థ లార్సెన్​ అండ్​​ టుబ్రోలో 2023 అక్టోబర్​ 1న ఛైర్మన్​- ఎండీ బాధ్యతలు స్వీకరించారు సుబ్రమణ్యన్. ఇక 2023-24 ఆర్థిక ఏడాదిలో ఆయన రూ. 51 కోట్ల జీతం పొందారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే తన జీతంలో 43.11శాతం హైక్​ పొందారు.

పలు నివేదికల ప్రకారం.. సుబ్రమణ్యన్ బేస్​ శాలరీ రూ. 3.6 కోట్లు. కమిషన్స్​ కింద రూ. 35.28 కోట్ల వరకు వస్తాయి. రీటైర్మెంట్​ బెనిఫిట్స్​ రూ. 10.5 కోట్ల వరకు ఉంటాయి. ప్రీరిక్వెసైట్స్​ (ముందస్తు అవసరాల) కింద రూ. 1.67 కోట్లు పొందుతున్నారు.

ఎల్​ అండ్​ టీ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సగటు జీతంతో పోల్చుకుంటే సుబ్రమణ్యన్​కి అందే వేతనం 534.57 రెట్లు అధికం! 2023-24 ఆర్థిక ఏడాదిలో సంస్థ ఉద్యోగుల సగటు వేతనం రూ. 9.55 లక్షలుగా ఉంది.

90 గంటల పని కామెంట్స్​పై తీవ్ర ఆగ్రహం..

సుబ్రమణ్యన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తల నుంచి సగటు ఉద్యోగి వరకు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇదే విషయంపై సోషల్​ మీడియా వేదికగా ట్రోల్స్​ చేస్తున్నారు.

"ఉద్యోగులు స్క్రీన్స్​ని ఎంతసేపని చూస్తూ కూర్చుంటారు?" అని ఒకరు కామెంట్​ చేయగా.. "ఆయన వైవాహిక జీవితం బాగోలేదని, కంపెనీ మొత్తాన్ని బలి చేస్తున్నారు," అని ఇంకొకరు చెప్పుకొచ్చారు.

"ఆదివారాలు పనిచేయడంలో తప్పు లేదు! కానీ అది మన డెవలప్​మెంట్​ కోసం అయ్యుండాలి," అని మరొకరు కామెంట్​ చేశారు. "అరె.. నువ్వెందుకు బతుకుతున్నావు? వచ్చి పని చెయ్​ అని అంటున్నారు," అని ఇంకొకరు అన్నారు.

"ఇలాంటి వారు రిటైర్మెంట్​ తర్వాత ఏం చేస్తారు? పని తర్వాత వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో," అని ఇంకొకరు చెప్పుకొచ్చారు.

ఎల్​ అండ్​ టీ స్పందన..

ఎస్​ఎన్​ సుబ్రమణ్యన్ చేసిన కామెంట్స్​పై దుమారం చెలరేగడంతో ఎల్​ అండ్​ టీ సంస్థ స్పందించింది.

"భారత దేశ ఆకాంక్షలకు ఛైర్మన్​ కామెంట్స్​ ప్రతిబింబం. అసాధారణ ఫలితాల కోసం అసాధారణ పని చేయాలి," అని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం