SBI : ఎస్​బీఐలో లోన్​ తీసుకున్నారా? అయితే మీ ఇంటికి 'చాక్లెట్స్​' వస్తాయి..!-sbi to send chocolates to borrowers who are likely to default on monthly repayments ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sbi : ఎస్​బీఐలో లోన్​ తీసుకున్నారా? అయితే మీ ఇంటికి 'చాక్లెట్స్​' వస్తాయి..!

SBI : ఎస్​బీఐలో లోన్​ తీసుకున్నారా? అయితే మీ ఇంటికి 'చాక్లెట్స్​' వస్తాయి..!

Sharath Chitturi HT Telugu
Sep 17, 2023 03:25 PM IST

SBI latest news : ఎస్​బీఐలో లోన్​ తీసుకుంటున్న రీటైర్లలకు చాక్లెట్​ బాక్స్​లు పంపాలని సంస్థ నిర్ణయించుకుంది. ఎందుకంటే..

ఎస్​బీఐలో లోన్​ తీసుకున్నారా? అయితే మీ ఇంటికి 'చాక్లెట్స్​' వస్తాయి..!
ఎస్​బీఐలో లోన్​ తీసుకున్నారా? అయితే మీ ఇంటికి 'చాక్లెట్స్​' వస్తాయి..! (MINT_PRINT)

SBI news : నెలవారీ లోన్​ రీపేమెంట్​ విషయంలో వినూత్న పద్ధతిని అవలంభించాలని నిర్ణయించుకుంది దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం.. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. రీపేమెంట్​ విషయమై లోన్​ తీసుకున్న వారికి.. 'చాక్లెట్లు' పంపాలని ఫిక్స్​ అయ్యింది! మరీ ముఖ్యంగా.. రీటైర్లలో ఎవరైతే సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించరని బ్యాంక్​ భావిస్తుందో.. వారికి కచ్చితంగా చాక్లెట్​ బాక్స్​ పంపించనుంది.

ఎందుకు ఈ నిర్ణయం..?

గత కొన్నేళ్లుగా.. మొత్తం బ్యాంకింగ్​ వ్యవస్థలో రీటైర్ లోన్స్​ భారీగా వృద్ధిచెందుతున్నాయి. 2023 జూన్​తో ముగిసిన త్రైమాసికానికి.. ఎస్​బీఐ రీటైల్​ లోన్​ బుక్​ రూ. 12,04,279కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో అది రూ. 10,34,111 కోట్లుగా ఉండేది.

అయితే.. వీరిలో కొందరు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా లేరని సంస్థ దృష్టికి వెచ్చింది. ఎన్ని మెసేజ్​లు పంపినా, సమాధానం ఇవ్వకూడదని సంబంధిత వ్యక్తులు నిర్ణయించుకున్నట్టు ఎస్​బీఐకి తెలిసింది. వారిలాంటి వారికోసమే.. నార్మల్​ మెసేజ్​లతో పాటు చాక్లెట్లు కూడా పంపించాలని ఫిక్స్​ అయ్యింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా

SBI chocolates news : "ఇది పైలట్​ ప్రాజెక్ట్​ కింద చేపడుతున్నాము. ఇందుకోసం.. కృత్రిమ మేథను ఉపయోగించే రెండు ఫిన్​టెక్​ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాము. మొదటి సంస్థ.. అప్పులు తీసుకున్న వారితో మాట్లాడుతుంది. ఇక రెండో సంస్థ.. ఎవరైతే అప్పులు తిరిగి చెల్లించకూడదని అనుకుంటున్నారో, వారికి చాక్లెట్​ బాక్స్​లు పంపిస్తుంది. రానున్న ఈఎంఐల గురించి రిమైండ్​ చేస్తుంది," అని ఎస్​బీఐలోని రిస్క్​, కంప్లైన్స్​, స్ట్రెస్ట్​ అసెట్స్​ విభాగం ఎండీ ఇన్​ఛార్జ్​ అశ్విని కుమార్​ తివారి తెలిపారు.

ఇదీ చూడండి:- SBI home loans: హోం లోన్ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్; ఈ కేటగిరీలకు వడ్డీ రేటు తగ్గింపు

తివారి ప్రకారం.. అప్పులు తీసుకున్న కొందరు, సంస్థ రిమైండర్లను పట్టించుకోకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. వీరి పేర్లను ఆయన చెప్పలేదు. కానీ.. వారి ఇంటికి తమ సిబ్బంది వెళుతుందని, చాక్లెట్​ బాక్స్​లు ఇచ్చి, డబ్బుల గురించి రిమైండ్​ చేస్తుందని తెలిపారు. ఈ పద్ధతిని ఇప్పటికే కొన్ని చోట్ల అమలు చేయగా.. అద్భుతమైన ఫలితం వచ్చిందని స్పష్టం చేశారు.

"15 రోజుల క్రితం, కొన్ని ప్రాంతాల్లో దీనిని అప్లై చేశాము. మంచి స్పందన లభించింది. సక్సెస్​ అయితే, ఫార్మల్​గా ప్రకటిస్తాము. మా కలెక్షన్​ ఎఫీషియెన్సీని మెరుగుపరిచేందుకు మరికొన్ని ఫిన్​టెక్​ సంస్థలను సంప్రదిస్తున్నాము. వారితో కలిసి పనిచేసేందుకు కృషిచేస్తున్నాము," అని తివారి పేర్కొన్నారు.

SBI home loan : ఎస్​బీఐ రీటైల్​ లోన్​ బుక్​లో ఆటో, హోం, ఎడ్జ్యుకేషన్​ రుణాలే అధికం. జున్​లో హోం లోన్​ బుక్​ వాటా రూ. 6.3కోట్లకు చేరింది. ఇది దేశంలోనే అత్యధికం.

Whats_app_banner

సంబంధిత కథనం