SBI Q3 results : క్యూ3లో దుమ్మురేపిన ఎస్బీఐ.. 68శాతం పెరిగిన లాభాలు!
SBI Q3 results 2023 : క్యూ3 ఫలితాల్లో ఎస్బీఐ దుమ్మురేపింది. అంచనాలకు మించి ఫలితాలు నమోదయ్యాయి.
SBI Q3 results 2023 : 2022-23 ఆర్థిక ఏడాది మూడో క్వార్టర్‌కు సంబంధించిన ఫలితాలను ఎస్బీఐ ప్రకటించింది. ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకుంటే.. ఎస్బీఐ నెట్ ప్రాఫిట్ 68శాతం పెరిగింది. ప్రావిజనింగ్ తక్కువ చేయడంతో పాటు వడ్డీపై భారీగా ఆదాయం అందుకోవడం ఇందుకు కారణం.
అంచనాలకు మించి ఫలితాలు..
క్యూ3లో రికార్డు స్థాయిలో రూ. 14,205కోట్ల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది ఎస్బీఐ. గతేడాది ఇదే త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభం రూ. 8,431 కోట్లుగా ఉంది. మార్కెట్ వర్గాల అంచనాలను తాజా ఎస్బీఐ త్రైమాసిక ఫలితాలు బీట్ చేశాయి.
SBI Q3 results : ఇక ఎస్బీఐ క్యూ3 ఫలితాల్లో.. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ (ఎన్ఐఐ) విషయానికొస్తే.. అది 24శాతం పెరిగి రూ. 38,068కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంతో ఆ విలువ రూ. 30,687కోట్లుగా ఉంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (ఎన్ఐఎం).. 3.5శాతానికి వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది 3.32శాతంగా ఉండేది.
HDFC Q3 results : హెచ్డీఎఫ్సీ క్యూ3 ఫలితాల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇయర్ ఆన్ ఇయర్లో ఎస్బీఐ లోన్ బుక్ 17.6శాతం వృద్ధిచెందడం విశేషం. డొమెస్టిక్ అడ్వాన్సెస్లు 17శాతం పెరిగాయి. పర్సనల్ లోన్, కార్పొరేట్ లోన్స్ కారణంగా ఇది జరిగింది. ఈ రెండూ కూడా 18శాతం వృద్ధిచెందాయి. ఎస్బీఐ టోటల్ డిపాజిట్లు రూ. 42 ట్రిలియన్కు పెరిగాయి. గతేడాది ఎస్బీఐ క్యూ3 ఫలితాల్లో అది రూ. 40 ట్రిలియన్గా ఉండేది.
'ఇంకా వృద్ధి సాధిస్తాము..'
SBI Q3 results news : "ఈ ఆర్థిక ఏడాదిలో మా లోన్ గ్రోత్ 14-15శాతం (ఇయర్ ఆన్ ఇయర్) వృద్ధిచెందుతుంది. క్రెడిట్ గ్రోత్ అనేది వచ్చే ఏడాది కూడా వృద్ధిచెందుతుంది. రోడ్లు, పోర్టులు, ఐరన్- స్టీల్ వంటి మౌలికవసతుల అంశాల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని మేము భావిస్తున్నాము. కన్జ్యూమర్ గూడ్స్ సెక్టార్ కూడా వృద్ధిచెందుతుంది. ఇవి మాకు లాభం కలిగిస్తాయి. డేటా సెంటర్, ఈవీలు, ఈవీ బ్యాటరీతో పాటు ఇతర రంగాలు కూడా వృద్ధి సాధిస్తాయని మాకు అనిపిస్తోంది," అని ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు.
ఎస్బీఐ మూడో త్రైమాసికం ఫలితాల్లో గ్రాస్ ఎన్పీఏ (నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్) రూ. 98,346కోట్లకు దిగొచ్చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 1.2ట్రిలియన్గా ఉండేది. మొత్తం ఆస్తుల్లో గ్రాస్ ఎన్పీఏ విలువ 3.14శాతంగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో అది 3.52శాతంగా, అంతకుముందు ఏడాదిలో అది 4.5శాతంగా ఉండేది. ఇక ఎస్బీఐ మూడో త్రైమాసికంలో నెట్ ఎన్పీఏ 0.77శాతంగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో అది 1.34శాతంగా ఉండేది.
SBI Q3 results today : ప్రస్తుత ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో ఎస్బీఐ ప్రావిజన్స్ 17శాతం కన్నా ఎక్కువ తగ్గి (ఇయర్ ఆన్ ఇయర్) రూ. 5,761కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంక్ ఫీజు ఆదాయం 3శాతం పెరిగి రూ. 5,928కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 5,747కోట్లుగా ఉండేది.
ఎస్బీఐ స్టాక్..
SBI Share price : శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎస్బీఐ షేర్లు 3.3శాతం వృద్ధిచెంది రూ. 546కి చేరాయి. ఇక నెల రోజుల్లో ఈ స్టాక్ 9.8శాతం పడింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎస్బీఐ స్టాక్ దాదాపు 11శాతం పతనమైంది. ఆరు నెలల్లో మాత్రం 2.3శాతం వృద్ధిచెందింది.