SBI home loans: హోం లోన్ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్; ఈ కేటగిరీలకు వడ్డీ రేటు తగ్గింపు-sbi offers up to 65 bps discount on home loan interest rates to these borrowers ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sbi Home Loans: హోం లోన్ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్; ఈ కేటగిరీలకు వడ్డీ రేటు తగ్గింపు

SBI home loans: హోం లోన్ కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్; ఈ కేటగిరీలకు వడ్డీ రేటు తగ్గింపు

HT Telugu Desk HT Telugu

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గృహ రుణాలు తీసుకోవాలనుకునేవారికి శుభవార్త తెలిపింది. సిబిల్ స్కోర్ (CIBIL score) ఆధారంగా గృహ రుణాల వడ్డీ రేటుపై 65 బేసిస్ పాయింట్ల వరకు డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం

పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో, కొత్త ఇల్లు, లేదా ఫ్లాట్ కోసం లోన్ (home loan) తీసుకోవాలనుకునే వారు ముందుగా, ఎస్బీఐ (SBI) ను సంప్రదించండి. సిబిల్ స్కోర్ (CIBIL Score) మంచిగా ఉన్న కస్టమర్లకు ఎస్బీఐ 65 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటుపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలకు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ను కానీ, దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్ ను కానీ సంప్రదించండి.

CIBIL Score: సిబిల్ స్కోర్

మన ఆర్థిక క్రమశిక్షణ, రుణాల చెల్లింపు, క్రెడిట్ కార్డ్ వినియోగం, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల్లో క్రమం తప్పని తీరు, చెక్ బౌన్స్ లు లేకపోవడం మొదలైన వాటి ఆధారంగా సిబిల్ స్కోర్ లభిస్తుంది. ఇప్పుడు అన్ని బ్యాంక్ లు, ఫైనాన్స్ సంస్థలు సిబిల్ స్కోర్ ఆధారంగానే లోన్స్ ఇస్తున్నాయి. చివరకు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్స్ ను కూడా సిబిల్ స్కోర్ ను చూసే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కూడా తమ హోం లోన్ లపై డిస్కౌంట్ ను ఇవ్వడానికి సిబిల్ స్కోర్ నే ఆధారంగా చేసుకుంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది.

ఎస్బీఐ ఆఫర్

750-800: సిబిల్ స్కోర్ 750 నుంచి 800 మధ్య ఉంటే గృహ రుణాల వడ్డీ రేటు లో 65 బేసిస్ పాయింట్ల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ అనంతరం వడ్డీరేటు 8.6% గా ఉంటుంది.

700 -749: సిబిల్ స్కోర్ 700 -749 మధ్య ఉంటే గృహ రుణాల వడ్డీ రేటు లో 55 బేసిస్ పాయింట్ల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ అనంతరం వడ్డీరేటు 8.7% గా ఉంటుంది. సిబిల్ స్కోర్ 700 కన్నా తక్కువ ఉంటే ఎలాంటి డిస్కౌంట్ ను ఆఫర్ చేయడం లేదు. వారికి 9.7% వడ్డీ రేటు ఉంటుంది.