SBI Account : మీకు ఎస్బీఐ ఖాతా ఉందా? అందులో నుంచి రూ.236 కట్.. టెన్షన్ పడకండి
SBI Account : మీకు ఎస్బీఐ ఖాతా ఉంటే అందులో నుంచి రూ.238 కట్ అయ్యాయని టెన్షన్ పడుతున్నారా? ఆ టెన్షన్ వద్దు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఈ డబ్బులు కట్ అవుతాయి.
మీకు తెలియకుండానే మీ ఎస్బీఐ ఖాతా నుండి 236 కట్ అయ్యాయా? ఎస్బీఐ మీ డబ్బును ఎందుకు కట్ చేస్తోంది? అని అనుమానం ఉందా? దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ సుమారు 50 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. యోనో మొబైల్ యాప్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాల ద్వారా ఎస్బీఐ తన వినియోగదారులకు అధునాతనమైన, సౌకర్యవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థను అందిస్తుంది.

ఎస్బీఐ ఖాతాదారులకు ఏటీఎమ్ కార్డ్‌లుగా డెబిట్ కార్డులను అందిస్తుంది. ఈ కార్డులు వినియోగదారులు ఏటీఎమ్‌ల నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి, షాపింగ్ కోసం ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు అలాంటి లావాదేవీలేమీ చేయకుండానే మీ బ్యాంక్ ఖాతా నుండి రూ.236 డెబిట్ చేసినట్లు వస్తుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద ఈ డబ్బులు కట్ అవుతాయి.
మెయింటెనెన్స్ ఛార్జీ
మీరు ఎస్బీఐ పాస్‌బుక్‌ని పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మీరు ఉపయోగిస్తున్న డెబిట్ కార్డ్ కోసం వార్షిక నిర్వహణ/సేవా ఛార్జీ కింద మీ ఖాతా నుండి నిధులు తీసుకుంటారు. ఈ కార్డుల కోసం బ్యాంకు వార్షిక నిర్వహణ రుసుము రూ.200 వసూలు చేస్తుంది. AMC అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద రుసుం రూ. 200తోపాటుగా జీఎస్టీ 18 శాతం అంటే మెుత్తం 236 రూపాయలు కట్ అవుతాయి. 200 ప్లస్ 18 శాతం జీఎస్టీ మెుత్తం 236 అవుతుంది.
ఎస్బీఐ కార్డులు, ఛార్జీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు వివిధ రకాల డెబిట్ కార్డ్‌లను అందిస్తుంది. యువ / గోల్డ్ / కాంబో / మై కార్డ్ డెబిట్ కార్డ్ ఛార్జీలు 250 ప్లస్ 18 శాతం జీఎస్జీ. ప్లాటినం డెబిట్ కార్డ్ 325 ప్లస్ జీఎస్టీ. ప్రైడ్/ప్రీమియం డెబిట్ కార్డ్‌లు 425 ప్లస్ 18 శాతం జీఎస్టీ. ప్లాటినం బిజినెస్ రూపే కార్డు 350 ప్లస్ 18 శాతం జీస్టీగా ఉంటుంది.
ఎస్బీఐ అందిస్తున్న సేవలు
ఎస్బీఐ అనేక రకాల సేవలు అందిస్తుంది. యోనో మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు తమ బ్యాంకింగ్, లోన్, ఇన్సూరెన్స్, ఇతర సేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వినియోగదారులు తమ ఖాతాను సులభంగా యాక్సెస్ చేయవచ్చు, లావాదేవీలు చేయవచ్చు, బ్యాలెన్స్ చెక్, ఇతర సేవలను 24 గంటలు చూసుకోవచ్చు. ఏటీఎమ్, డెబిట్ కార్డ్, ఆన్‌లైన్ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎస్బీఐ కస్టమర్లు వివిధ రకాల సేవలు పొందుతున్నారు.
టాపిక్