SBFC Finance IPO: ఈ రోజు ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీఓ అలాట్మెంట్; జీఎంపీ ఎంతో తెలుసా..?
SBFC Finance IPO: ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీఓ అలాట్మెంట్ ఆగస్ట్ 10వ తేదీన జరగనుంది. ఈ రోజు ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 40 గా ఉంది.
SBFC Finance IPO: ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీఓ అలాట్మెంట్ ఆగస్ట్ 10వ తేదీన జరగనుంది. ఈ రోజు ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 40 గా ఉంది. ఈ ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లు తమకు షేర్లు అలాట్ అయ్యాయో లేదో బీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ bseindia.com. ను చెక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
జీఎంపీ రూ. 40..
అలాట్మెంట్ రోజు అయిన ఆగస్ట్ 10వ తేదీన ఈ ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీఓ జీఎంపీ రూ. 40గా ఉంది. అంటే, ఇష్యూ ప్రైస్ పై రూ. 40 అధికంగా ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు తమకు ఈ షేర్లు అలాట్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి బీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ bseindia.com.ను కానీ, ఐపీఓ అధికారిక రిజిస్ట్రార్ అయిన KFin Technologies వెబ్ సైట్ ను కానీ చెక్ చేయవచ్చు. ఈ ఐపీఓకు అన్ని వర్గాల ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది.
IPO allotment status check: ఇలా చెక్ చేసుకోండి..
బీఎస్ఈ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవాలనుకుంటే.. ముందుగా
- బీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ లింక్ bseindia.com/investors/appli_check.aspx; ను ఓపెన్ చేయాలి.
- ఇష్యూ టైప్ వద్ద ఈక్విటీ (equity) ని సెలెక్ట్ చేసుకోవాలి.
- SBFC Finance IPO ను సెలెక్ట్ చేసుకోవాలి.
- మీ అప్లికేషన్ నంబర్ ను కానీ, పాన్ నంబర్ ను కానీ ఎంటర్ చేయాలి.
- 'I'm not a robot' బాక్స్ ను టిక్ చేయాలి. ఆ పై సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి.
- మీ అలాట్మెంట్ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.