Sanofi India: రూ. 194 డివిడెండ్ ప్రకటించిన ఫార్మా కంపెనీ-sanofi india declares rs 194 final dividend and rs 183 special dividend ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Sanofi India Declares <Span Class='webrupee'>₹</span>194 Final Dividend And <Span Class='webrupee'>₹</span>183 Special Dividend

Sanofi India: రూ. 194 డివిడెండ్ ప్రకటించిన ఫార్మా కంపెనీ

HT Telugu Desk HT Telugu
Feb 23, 2023 09:05 PM IST

Sanofi India: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల అనంతరం షేర్ హోల్డర్లకు ఫార్మా సంస్థ ‘సనొఫి ఇండియా (Sanofi India Ltd) రూ. 194 ల డివిడెండ్ ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (PTI)

Sanofi India: ప్రముఖ మల్టీ నేషనల్ ఫార్మా సంస్థ సనొఫి ఇండియా (Sanofi India Ltd) తన షేర్ హోల్డర్లకు రూ. 194 ల డివిడెండ్ ప్రకటించింది. ఫార్మా రంగంలో సనొఫి సంస్థ చాలా పాపులర్. సనొఫి ఇండియా మార్కెట్ క్యాప్ రూ. 12,344.66 కోట్లు.

ట్రెండింగ్ వార్తలు

Sanofi India special dividend: స్పెషల్ డివిడెండ్

సనొఫి ఇండియా (Sanofi India Ltd) సంస్థ షేర్ హోల్డర్లకు రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతీ ఈక్విటీ షేర్ పై రూ. 194 ల డివిడెండ్ ప్రకటించింది. అలాగే, ప్రత్యేక డివిడెండ్ గా రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతీ ఈక్విటీ షేర్ పై రూ. 183 ల ఇవ్వనుంది. అంటే, మొత్తంగా ఒక్కో ఈక్విటీ షేరుపై మదుపర్లకు డివిడెండ్ గా రూ. 377 లభించనుంది. 67వ వార్షిక జనరల్ మీటింగ్ లో షేర్ హోల్డర్ల ఆమోదం అనంతరం ఈ మొత్తాన్ని షేర్ హోల్డర్ల ఖాతాలలో జమ చేయనున్నారు. మే 22 లోగా ఈ మొత్తం వారి బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది. 2022 ఆగస్ట్ లో సనొఫి ఇండియా (Sanofi India Ltd) సంస్థ షేర్ హోల్డర్లకు రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతీ ఈక్విటీ షేర్ పై రూ. 193 ల డివిడెండ్ అందించింది. అంటే, 2022 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు సనొఫీ తన షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ. 570 ల డివిడెండ్ అందించింది.

Sanofi India Q3 results: Q3 లో లాభాలు..

సనొఫి ఇండియా (Sanofi India Ltd) సంస్థ 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3FY23) రూ. 671.9 కోట్ల ఆదాయం సముపార్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం Q3 లో సాధించిన ఆదాయం కన్నా 2.32% తక్కువ. అలాగే, ఈ Q3 లో సనొఫి ఇండియా రూ. 130.9 కోట్ల నికర లాభాలను పొందింది. గత గత ఆర్థిక సంవత్సరం Q3 లో సంస్థ రూ. 90.4 కోట్లు. అంటే గత ఆర్థిక సంవత్సరం Q3 కన్నా ఈ ఆర్థిక సంవత్సరం Q3 లో 44.8% అధిక లాభాలను సంస్థ సముపార్జించింది. సనొఫి ఇండియా షేర్ విలువ గురువారం నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ లో రూ. 5,369 వద్ద ముగిశాయి.

WhatsApp channel