బాలీవుడ్ తారలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారుతున్న ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు, లగ్జరీ ఫీలింగ్!
Toyota Vellfire : సినిమా తారాలు అంటే వారి కార్లు ఎంతో లగ్జరీగా ఉంటాయో తెలిసిందే. చూడగానే మనం కూడా ప్రేమలో పడతాం. ఇప్పుడు బాలీవుడ్ తారాలు ఎక్కువగా టయోటా వెల్‌ఫైర్ కారు వైపు చూస్తున్నారు. తాజాగా సంజయ్ కపూర్ కూడా ఈ కారును తన గ్యారేజీకి తెచ్చుకున్నారు.
సినిమా స్టార్స్ తమ కార్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. లుక్‌తోపాటుగా లగ్జరీ ఫీలింగ్ వచ్చే కార్లను కొనుక్కుంటారు. బాలీవుడ్ నటుడు, నిర్మాత సంజయ్ కపూర్ ఇటీవల కొత్త టయోటా వెల్‌ఫైర్ వీఐపీ ఎగ్జిక్యూటివ్ లాంజ్ వేరియంట్‌ను తన గ్యారేజీలో చేర్చారు. ఈ వాహనం ధర రూ.1.5 కోట్లు(ఎక్స్-షోరూమ్). బ్లాక్ కలర్‌లో కొనుక్కున్నాడు. సంజయ్, అతని భార్య మహీప్ కపూర్ ఇటీవల బాంద్రాలోని ఒక రెస్టారెంట్లో భోజనం కోసం ఇదే కారులో వచ్చారు. ఈ సమయంలో తన కొత్త కారుకు సంబంధించిన వీడియోను 'కార్స్ ఫర్ యూ' యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. ఈ కారు ప్రత్యేకత ఏంటో వివరంగా తెలుసుకుందాం.
బాలీవుడ్‌లో వెల్‌ఫైర్‌కు పెరుగుతున్న క్రేజ్
ఇప్పుడు ఈ లగ్జరీ ఎమ్‌పీవీని సొంతం చేసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీల జాబితాలో సంజయ్ కపూర్ చేరాడు. రాకేష్ రోషన్, అక్షయ్ కుమార్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అనిల్ కపూర్, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్ ఇప్పటికే ఈ కారును కలిగి ఉన్నారు. అదే సమయంలో రణబీర్ కపూర్ వంటి కొందరు తారలు వెల్‌ఫైర్ ప్రీమియం వెర్షన్ అయిన లెక్సస్ ఎల్ఎమ్‌ను కలిగి ఉన్నారు.
టయోటా వెల్‌ఫైర్ వైపు బాలీవుడ్ తారాల చూపు పడేందుకు కారణం దాని అద్భుతమైన కంఫర్ట్, లగ్జరీ. ఇది లాంజ్ లాంటి సీటింగ్, సులభంగా ఎక్కడం, దిగడం, తగినంత లెగ్ రూమ్‌ను అందిస్తుంది.
వెల్‌ఫైర్ స్పెసిఫికేషన్లు
వెల్‌ఫైర్ 2.5-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 193 బీహెచ్పీ శక్తిని, 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇ-సివిటి ట్రాన్స్ మిషన్‌తో ఇది లీటరుకు 19.28 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ వాహనం టయోటా టీఎన్జీఎ-కె ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది వాహనం డైనమిక్స్, రైడ్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.
డిజైన్, ఫీచర్లు
2024 మోడల్ వెల్‌ఫైర్‌లో పెద్ద ఫ్రంట్ గ్రిల్, స్లీక్ ఎల్ఈడీ హెడ్ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సిల్వర్, వైట్, బ్లాక్ రంగుల్లో ఈ వాహనం అందుబాటులో ఉంది. ఇది క్యాబిన్ కోసం మూడు ఆప్షన్స్ అందిస్తుంది. సన్ సెట్ బ్రౌన్, బ్లాక్, న్యూట్రల్ బీజ్.
టయోటా వెల్‌ఫైర్ కారులో 14 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 15 స్పీకర్ల జెబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పవర్ అడ్జస్టబుల్ కెప్టెన్ కుర్చీలు, వైర్లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్‌ప్లే, రెండో లైన్ కోసం సీట్లు ఉన్నాయి. టయోటా వెల్‌ఫైర్ కేవలం లగ్జరీ ఎమ్‌పీవీ మాత్రమే కాదు, టెక్నాలజీ, కంఫర్ట్‌ను ఎలా కలపవచ్చో కూడా చూపిస్తుంది. అందుకే సంజయ్ కపూర్‌తో పాటు ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కారును తమ గ్యారేజీల్లోకి చేర్చారు.