Telugu News  /  Business  /  Samsung Unveils Yet Another Entry-level Smartphone Galaxy A04e, Check Price Details
Samsung Galaxy A04e
Samsung Galaxy A04e

Samsung Galaxy A04e । శాంసంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్లు ఇవే!

23 October 2022, 11:14 ISTHT Telugu Desk
23 October 2022, 11:14 IST

శాంసంగ్ కంపెనీ మరొక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ Samsung Galaxy A04e దీని ధర, ఫీచర్లు చెక్ చేయండి.

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్, తమ గెలాక్సీ A-సిరీస్‌ పరిధిని మరింత విస్తరించింది. తాజాగా Samsung Galaxy A04e పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ ఇటీవలే Galaxy A04s పేరుతో ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ కొత్త మోడల్ కూడా దాదాపు అదే స్థాయి ఫీచర్లను కలిగి ఉంటుంది. కాబట్టి Galaxy A04e కూడా అందుబాటు ధరలోనే లభించనుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ హ్యాండ్‌సెట్ పాలికార్బోనేట్ యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంది. వెనుక ప్యానెల్ నుండి డిస్‌ప్లే ప్రాంతాన్ని వేరు చేసే ఫ్రేమ్ లేదు. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

స్టోరేజ్ పరంగా Samsung Galaxy A04e స్మార్ట్‌ఫోన్‌ మూడు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. టాప్- స్పెక్ వేరియంట్ 4GB ర్యామ్/128GB ఇంటర్నల్ స్టోరేజ్ గా ఉంటుంది. మైక్రో SD కార్డ్‌తో మెమరీని 1TB వరకు విస్తరించుకోవచ్చు. ఫీచర్ల జాబితాలో ఇంకా ఏయే అంశాలు ఉన్నాయో పరిశీలిద్దాం.

Samsung Galaxy A04e స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగిన 6.5-అంగుళాల HD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లే
  • 4GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆక్టా-కోర్ ప్రాసెసర్*
  • వెనకవైపు 13MP+2MP డ్యూయల్ కెమెరా
  • ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ (One UI 4.1)
  • 5000mAh బ్యాటరీ సామర్థ్యం
  • అంచనా ధర, రూ. 13,499/-

ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లూ, బ్లాక్, బ్రాంజ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభించనుంది.

Samsung Galaxy A04e ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్టింగ్ లోకి వచ్చింది. లాంచ్ తేదీని ఖరారు చేయాల్సి ఉంది