Samsung S25 series pre booking: శాంసంగ్ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ప్రి బుకింగ్స్ ఓపెన్
Samsung S25 series pre bookings: శాంసంగ్ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు భారతదేశంలో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు అధికారిక లాంచ్ కు ముందే ప్రి బుక్ చేసుకోవచ్చు. శాంసంగ్ ఎస్ 25 సిరీస్ ను ముందే బుక్ చేసుకున్నవారికి రూ. 5 వేల వరకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయి.
శాంసంగ్ తన గెలాక్సీ అన్ ప్యాక్డ్ ఈవెంట్ లో జనవరి 22, 2025 న గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ను ఆవిష్కరించనుంది. అధికారిక లాంచ్ కు ముందు, కంపెనీ భారతదేశంలో ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కోసం ప్రీ-రిజర్వేషన్లను స్వీకరించడం ప్రారంభించింది.
శాంసంగ్ ఎస్ 25 సిరీస్: ప్రీ-రిజర్వేషన్ వివరాలు
వినియోగదారులు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను రూ .1,999 రీఫండబుల్ చెల్లింపు ద్వారా ప్రీ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇలా ముందే బుక్ చేసుకోవడం వల్ల శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ సాధారణ ప్రజల కన్నాముందే వీరికి అందుతాయి. అంతేకాదు, రూ .5,000 విలువైన అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ప్రీ-రిజర్వేషన్ ఆఫర్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఇది రీఫండ్ ఆఫర్. ఒకవేళ, మీరు తరువాత మనసు మార్చుకుని, ఈ ఫోన్ కొనొద్దనుకుంటే, మీ డబ్బును తిరిగి ఇస్తారు.
వెబ్ సైట్ ఆర్డర్స్ కోసం ఎక్స్ క్లూజివ్ బెనిఫిట్స్
శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ డివైజ్ లను రిజర్వ్ చేసుకునే వారికి శాంసంగ్ మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. వారికి స్పెషల్ ఎడిషన్ కలర్స్ అందుబాటులో ఉంటాయి. వివిధ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, మీ వద్ధ ప్రస్తుతం ఉన్న శాంసంగ్ ఫోన్ కు మంచి ఎక్స్చేంజ్ వ్యాల్యూ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్: ముఖ్య ఫీచర్లు (అంచనా)
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లో స్టాండర్డ్ గెలాక్సీ ఎస్ 25, గెలాక్సీ ఎస్ 25 ప్లస్, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా అనే మూడు ప్రధాన మోడళ్లు ఉంటాయని భావిస్తున్నారు. నాలుగో మోడల్ గెలాక్సీ ఎస్ 25 స్లిమ్ కూడా లాంచ్ కావచ్చని, ఇది శాంసంగ్ నుండి వచ్చిన సన్నని ఫ్లాగ్ షిప్ మోడల్ కావచ్చని పుకార్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ లోని అన్ని స్పెసిఫికేషన్లను ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ఊహాగానాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. కొత్త వన్ యూఐ 7 సాఫ్ట్ వేర్ కొత్త ఫీచర్లతో పాటు సున్నితమైన, మరింత యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. హార్డ్వేర్ విషయానికి వస్తే, ఈ సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్, అధునాతన కెమెరా వ్యవస్థలు, డైనమిక్ అమోఎల్ఇడి డిస్ప్లే ఉండవచ్చని భావిస్తున్నారు.
ముందే బుక్ చేసుకుంటే ఈ లాభాలు.
శాంసంగ్ (samsung) గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ను ప్రీ-రిజర్వ్ చేసుకున్న వినియోగదారులు సాధారణ ప్రజల కంటే ముందుగానే డివైజ్లను యాక్సెస్ చేస్తారు. రూ. 5 వేల వరకు విలువైన ప్రయోజనాలు పొందుతారు. రీఫండ్ సౌలభ్యం ఉన్నందువల్ల, ఫోన్ కొనుగోలు చేయడం ఇష్టం లేకపోతే, ఆ మొత్తం తిరిగి పొందవచ్చు.