Best premium smartphone : ఈ రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఎందులో ఏఐ ఫీచర్స్ ఎక్కువ?
Samsung Galaxy S25 vs iPhone 16 : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 వర్సెస్ ఐఫోన్ 16.. ఈ రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఏది పవర్ఫుల్? ఎందులో ఏఐ ఫీచర్స్ ఎక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 లాంచ్‌తో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో పోటీ మరింత పెరిగింది! ఈ సెగ్మెంట్లో ఐఫోన్ 16కి ఇప్పటికే మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి ఏది బెస్ట్? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 వర్సెస్ ఐఫోన్ 16: ధర
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 స్మార్ట్‌ఫోన్ 12 జీబీ ర్యామ్- 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ప్రారంభ ధర రూ .80999గా ఉంది. ఇక ఐఫోన్ 16 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,990.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 వర్సెస్ ఐఫోన్ 16: డిజైన్ అండ్ డిస్ప్లే..
గెలాక్సీ ఎస్ 25, ఐఫోన్ 16 చాలా విభిన్నమైన డిజైన్ ప్రొఫైల్స్‌ని కలిగి ఉన్నాయి. ఈసారి శాంసంగ్ కొన్ని ప్రధాన డిజైన్ మార్పులు చేసింది. ఇది స్మర్ట్ఫోన్ని దాని మునుపటి జనరేషన్ కంటే మరింత తేలికగా చేసింది. మరోవైపు, ఐఫోన్16లో నిలువుగా అమర్చిన కెమెరాలు, కొత్త కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ వంటివి ఉన్నాయి.
డిస్ప్లే కోసం, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2600 అడుగుల పీక్ బ్రైట్‌నెస్‌తో 6.2 ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఐఫోన్16లో 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2000నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. ఐఫోన్ 16 డిస్ప్లేలో డైనమిక్ ఐలాండ్ కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 వర్సెస్ ఐఫోన్ 16: పనితీరు, బ్యాటరీ, ఏఐ ఫీచర్లు..
పర్ఫార్మెన్స్ విషయంలో.. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో 12 జీబీ ర్యామ్, అడ్రినో 830 జీపీయూతో కనెక్ట్ చేసిన గెలాక్సీ ప్రాసెసర్‌తో వస్తుంది. మరోవైపు, యాపిల్ ఐఫోన్ 16 5-కోర్ జీపీయూ, 8 జీబీ ర్యామ్‌తో కనెక్ట్ చేసిన ఏ18 చిప్‌తో పనిచేస్తుంది. రెండు పరికరాలు ఆశాజనక పనితీరు, ఏఐ సామర్థ్యాలను అందిస్తాయి.
ఏఐ పరంగా, శాంసంగ్ నౌ బ్రీఫ్, నౌ బార్, ఏఐ సెలెక్ట్ సహా మరెన్నో గెలాక్సీ ఏఐ ఫీచర్లకు అదనంగా చేర్చింది. అదనంగా, యాప్స్ అంతటా అనేక యాక్టివిటీస్ కోసం జెమినీ ఎక్స్టెన్షన్ పవర్ బటన్ మద్దతు ఇస్తుంది. మరోవైపు, ఐఫోన్ 16లో యాపిల్ ఇంటెలిజెన్స్ రైటింగ్ టూల్స్, మెయిల్ సమ్మరీ, విజువల్ ఇంటెలిజెన్స్, చాట్‌జీపీటీ ఇంటిగ్రేషన్, మరెన్నో వంటి అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
మెరుగైన పనితీరు కోసం, గెలాక్సీ ఎస్ 25 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఐఫోన్ 16 20 వాట్ వైర్డ్ ఛార్జింగ్ తో 3561 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 వర్సెస్ ఐఫోన్ 16: కెమెరా
ఫోటోగ్రఫీ కోసం, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ట్రిపుల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరి కెమెరా ఉంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వంటివి ఉన్నాయి. ఇక ఐఫోన్ 16 డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం రెండు మోడళ్లు 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాపై ఆధారపడతాయి.