Samsung Galaxy S25 Series : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ తయారీ భారత్‌లోనే.. ఇక్కడి నుంచే ప్రపంచ మార్కెట్‌లోకి
Samsung Galaxy S25 Series Made In India : శాంసంగ్ గెలాక్సీ ఎస్25ను భారతదేశంలోని నోయిడా శాంసంగ్ ప్లాంట్లో తయారు చేయనున్నారు. ఈ మేరకు శాంసంగ్ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈవో జెబి పార్క్ తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌ను జనవరి 22న విడుదల చేసింది. ఈ సిరీస్ కింద శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాలను కంపెనీ ప్రవేశపెట్టింది. అదే సమయంలో గెలాక్సీ ఎస్25 భారతదేశంలోని నోయిడాలోని శాంసంగ్ ప్లాంటులో తయారవుతుందని శాంసంగ్ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జెబి పార్క్ చెప్పారు.

శాంసంగ్ వృద్ధిలో భారతీయ వినియోగదారులు ముఖ్యమైన భాగమని, ఈ ఏఐ డివైజ్లను భారత్లోనే తయారు చేయడం గర్వంగా ఉందని జెబీ పార్క్ చెప్పారు. గెలాక్సీ ఎస్ 25 సిరీస్ అభివృద్ధిలో ముఖ్యంగా దాని అధునాతన ఏఐ సామర్థ్యాలలో భారతీయ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించారన్నారు.
శాంసంగ్ నోయిడా ప్లాంట్ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్. ఇప్పటికే గత సంవత్సరం గెలాక్సీ ఎస్24 సిరీస్‌తో సహా మరెన్నో పరికరాలను తయారు చేయడానికి ఉపయోగించారు. ఎస్25 సిరీస్‌లో శాంసంగ్ భారతీయ ఇంజనీరింగ్ బృందం కీలక పాత్ర పోషించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ధరలు చూస్తే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25.. 12జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .80,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.92,999గా ఉంటుంది. గెలాక్సీ ఎస్25 ప్లస్ 12జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.99,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,29,999గా ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 12జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,29,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,41,999గా ఉంటుంది. 12 జీబీ ర్యామ్ ప్లస్ 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,65,999కు దొరుకుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ ఫోన్లలో కస్టమైజ్డ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ ఉంది. ఇది కాకుండా అన్ని ఫోన్లు 12జీబీ ర్యామ్‌తో 1టీబీ వరకు స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. అదే సమయంలో దీని అల్ట్రా వేరియంట్లో గూగుల్ జెమినీ ఏఐ అసిస్టెంట్ లభిస్తుంది. ఏఐ ఫీచర్లు ఇప్పుడు గెలాక్సీ ఎస్25 సిరీస్‌లో అందుబాటులో ఉంటాయి.