Samsung Galaxy S25 : సూపర్ కూల్ ఏఐ ఫీచర్స్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎంటర్ప్రైజ్ ఎడిషన్..
మెరుగైన సెక్యూరిటీ, ఉపయోగకరమైన ఏఐ ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

శాంసంగ్ జనవరిలో గెలాక్సీ ఎస్25 సిరీస్‌ని ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. అయితే నెల రోజుల్లోనే శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఎంటర్ప్రైజ్ ఎడిషన్‌ను సంస్థ ప్రకటించింది. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ని వెల్లడించడానికి కంపెనీ కొన్ని నెలల సమయం తీసుకుంటున్న ఊహాగానాల మధ్య ఈ లాంచ్ ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతానికి, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్లు యూరప్‌లో లైవ్ అయ్యాయి. మీరు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కోసం వేచి ఉన్నట్లయితే, ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇక్కడ చూసేయండి..
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లాంచ్..
స్పెసిఫికేషన్ల పరంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25, గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ స్టాండర్డ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌కు సమానమైన ఫీచర్లను అందిస్తున్నాయి. అయితే బిజినెస్ మోడల్స్, ఎంటర్ప్రైజ్ యూజర్లకు ఉపయోగపడేలా కొన్ని కొత్త చేర్పులు, భద్రతా ఆంక్షలు, ఏఐ ఫీచర్లు వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎంటర్ప్రైజ్ఎడిషన్లో.. శాంసంగ్ నాక్స్ సూట్ సబ్స్క్రిప్షన్ ఒక సంవత్సరం వరకు ఎటువంటి ఖర్చు లేకుండా, 3 సంవత్సరాల వరకు వ్యాపార మద్దతు ఉంటుంది.
శామ్మొబైల్ ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎంటర్ప్రైజ్ ఎడిషన్‌తో కూడిన ఒక యూట్యూబ్ వీడియోను ప్రదర్శించింది. కొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లు వ్యాపార ఉత్పాదకతను ఎలా పెంచుతాయనే దానిపై ఈ వీడియో దృష్టి సారించింది. సమ్మరీతో కాల్ ట్రాన్స్‌స్క్రిప్ట్, రైటింగ్ అసిస్ట్, ట్రాన్స్స్క్రిప్ట్తో సమావేశాలను రికార్డ్ చేయడం సహా మరెన్నో ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ని వ్యాపార సంబంధిత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు కాబట్టి, శాంసంగ్ డేటా ఎన్క్రిప్షన్, నాక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా రిమోట్ డేటా మేనేజ్మెంట్, కోల్పోయిన లేదా దొంగిలించిన పరికరాలను గుర్తించడం- లాక్ చేయడం, ఏఐ భద్రత సహా వివిధ పరికరాలలో అంతరాయం లేని డేటా ట్రాన్స్ఫర్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఇండియా లాంచ్‌పై ఇంకా ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి యూరప్‌లో మాత్రమే ఈ డివైజ్లను ప్రీ-ఆర్డర్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాగా.. గెలాక్సీ ఎస్25 అల్ట్రా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ధర £1,269గా ఉంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే £20 ఎక్కువ అని నివేదికలు సూచిస్తున్నాయి. గెలాక్సీ ఎస్25 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ యూకే వేరియంట్ ధర £819గా ఉంది.
మరో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్ లో ఉంది! టెక్నాలజీ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
సంబంధిత కథనం