ఇంత స్లిమ్​ స్మార్ట్​ఫోన్​ని మీరు చూసుండరు! శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ లాంచ్..-samsung galaxy s25 edge launched in india with ultra slim design see all details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇంత స్లిమ్​ స్మార్ట్​ఫోన్​ని మీరు చూసుండరు! శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ లాంచ్..

ఇంత స్లిమ్​ స్మార్ట్​ఫోన్​ని మీరు చూసుండరు! శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ లాంచ్..

Sharath Chitturi HT Telugu

శాంసంగ్​ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ తాజాగా లాంచ్​ అయ్యింది. ఈ స్మార్ట్​ఫోన్​ చాలా స్లిమ్​గా ఉంది. 5.8 ఎంఎం స్లిమ్ డిజైన్​తో భారతదేశంలో అడుగుపెట్టింది. ఈ ఫ్లాగ్​షిప్ మోడల్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ లాంచ్.. (Samsung)

శాంసంగ్ తన కొత్త అల్ట్రా స్లిమ్ స్మార్ట్​ఫోన్​ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్​ని ఇండియాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ లాంచ్​తో, స్మార్ట్​ఫోన్స్​కి సంబంధించి కొత్త సెగ్మెంట్​ని ప్రారంభించినట్టు వివరించింది. ఈ మోడల్​ శాంసంగ్​ గెలాక్సీ ఎస్​ సిరీస్​లో చేరుతుందని వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ థిక్​నెస్​ కేవలం 5.8 ఎంఎం! బరువు 163 గ్రాములు మాత్రమే. ఇది కంపెనీకి కొత్త ఎత్తు. గెలాక్సీ ఎస్25 అల్ట్రా 8.2 ఎంఎం థిక్​నెస్​, 218 గ్రాముల బరువు కలిగి ఉంది. గెలాక్సీ ప్రాసెసర్, ఆన్-డివైజ్ ఏఐ సామర్థ్యాల కోసం స్నాప్​డ్రాగన్​ 8 ప్రాసెసర్​ ఇందులో ఉంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్మార్ట్​ఫోన్​ని దాని స్లిమ్​నెస్, మన్నికైన బిల్ట్​ కోసం "ఇంజనీరింగ్ మార్వెల్" అని పిలుస్తున్నారు! 5.8 ఎంఎం థిక్​నెస్​ ఉన్న ఈ స్మార్ట్​ఫోన్​ ఇంపాక్ట్ రెసిస్టెన్స్​తో పాటు క్రిస్ప్ విజువల్స్ కోసం ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2తో కొన్ని గొప్ప ఫీచర్లను కూడా అందిస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో 6.7 ఇంచ్​ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ క్యూహెచ్​డీ+ డిస్​ప్లే ఇందులో అందించారు.

పర్ఫార్మెన్స్​ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ 12 జీబీ ర్యామ్​కి స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్​ కనెక్ట్​ చేసి ఉంటుంది. హీటింగ్​ విషయంలో ఇందులో ఎక్స్​ప్యాండెడ్​ వేపర్​ ఛాంబర్​ కూడా ఉంది. క్వాల్​మ్ చిప్​తో, ఈ స్మార్ట్​ఫోన్ నౌ బ్రీఫ్, నౌ బార్, జెమినీ లైవ్, ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ సహా మరెన్నో ఫీచర్లతో ఆన్-డివైజ్ గెలాక్సీ ఏఐ అనుభవాలను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్​యూఐ 7 ఆపరేటింగ్ సిస్టెంపై ఈ స్మార్ట్​ఫోన్ పనిచేయనుంది.

ఫోటోగ్రఫీ కోసం, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ డ్యూయెల్ కెమెరా సెటప్​ను కలిగి ఉంది. ఇందులో 2ఎక్స్ ఆప్టికల్ క్వాలిటీ జూమ్​తో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆటోఫోకస్​తో 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందువైపు 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఆడియో ఎరేజర్ 2, డ్రాయింగ్ అసిస్ట్ వంటి ఏఐ ఫీచర్స్​ ఉన్నాయి. గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 3900 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్- కలర్​ ఆప్షన్స్​..

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అవి.. టైటానియం సిల్వర్, టైటానియం జెట్​బ్లాక్​, టైటానియం ఐసీబ్లూ. 12 జీబీ+256 జీబీ, 12 జీబీ+512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.

ఈ స్మార్ట్​ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అధికారికంగా ప్రకటించిన తర్వాత మేము మీకు చెబుతాను. స్టే ట్యూన్డ్​ టు హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం