Premium smartphone : ఈ శాంసంగ్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్​పై అతి భారీ డిస్కౌంట్​- ఆఫర్​ మిస్​ అవ్వకండి..-samsung galaxy s24 ultra price drops on amazon after s25 ultra launch see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Premium Smartphone : ఈ శాంసంగ్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్​పై అతి భారీ డిస్కౌంట్​- ఆఫర్​ మిస్​ అవ్వకండి..

Premium smartphone : ఈ శాంసంగ్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్​పై అతి భారీ డిస్కౌంట్​- ఆఫర్​ మిస్​ అవ్వకండి..

Sharath Chitturi HT Telugu

Samsung Galaxy S24 Ultra price drop : ఇండియాలో శాంసంగ్​ ఎస్24 అల్ట్రాపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అమెజాన్​లో ఈ మోడల్​కి సంబంధించిన బెస్ట్​ డీల్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​24 అల్ట్రా.. (Shaurya Tomer/HT Tech)

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​25 లాంచ్​ అయిన నేపథ్యంలో గెలాక్సీ ఎస్​24 ధర భారీగా దిగొచ్చింది. ఈ మోడల్​పై అమెజాన్​లో అతి భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఫలితంగా రూ. 35వేల కన్నా తక్కువ ధరకే శాంసంగ్​ గెలాక్సీ ఎస్​24ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాపై భారీ డిస్కౌంట్స్​..

శాంసంగ్​ గెలాక్సీ ఎస్24 అల్ట్రా (టైటానియం వయొలెట్) 256 జీబీ మోడల్ ధర రూ. 1,29,999 గా ఉండేది. కానీ ప్రస్తుతం అమెజాన్​లో ఇది రూ .99,390 వద్ద లిస్ట్​ అయ్యింది. అంటే దాదాపు రూ .30,000 తక్కువ. ఇక క్రెడిట్ కార్డ్ ఆఫర్లను కలపడం ద్వారా మీరు మరింత మెరుగైన డీల్ పొందవచ్చు! మీకు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే.. 5% క్యాష్​బ్యాక్​ని పొందవచ్చు. ఇది సుమారు రూ .4,970 వరకు ధరను తగ్గిస్తుంది. దీంతో మొత్తం ధర రూ.94,420కు దిగొస్తుంది. ఇది వాస్తవ ఎంఆర్​పీ కంటే సుమారు రూ.35,000 తక్కువ.

ఎస్25 అల్ట్రా లాంచ్ తర్వాత.. ఎస్24 అల్ట్రా కొనుగోలు చేయొచ్చా?

ప్రస్తుతం సుమారు రూ.95,000 ధరకు లభ్యమవుతున్న ఎస్24 అల్ట్రా కంటే ఎస్25 అల్ట్రా ఖరీదైనది. కానీ మీరు అదనపు డబ్బును ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటే, ఎస్ 25 అల్ట్రా మంచి ఆప్షన్​ అవుతుంది. ఇది అనేక గుర్తించదగిన అప్​గ్రేడ్స్​ని అందిస్తుంది, ముఖ్యంగా దాని డిజైన్​లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. రౌండ్​ ఎడ్జెస్​ దీనిని మరింత ఎర్గోనామిక్ చేస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక ఉపయోగం కోసం ఇది బెస్ట్​.

గెలాక్సీ ఎస్​25 స్నాప్​డ్రాగన్​ 8 ఇలైట్​ ప్రాసెసర్​ని కూడా పొందుతుంది. ఇది కంపెనీ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్​షిప్​ ప్రాసెసర్. ఇంకా, శాంసంగ్​ ఎస్25 అల్ట్రా వర్చువల్ అపర్చర్, గెలాక్సీ లాగ్, మెరుగైన సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక కొత్త కెమెరా-సెంట్రిక్​, ప్రత్యేకమైన ఏఐ ఫీచర్లను అందిస్తోంది.

మీరు ఎస్24 అల్ట్రా స్మార్ట్​ఫోన్​ బాక్సీ డిజైన్​, షార్ప్​ ఎడ్జెస్​ని ఇష్టపడితే, ఇది మీకు సరైన ఎంపిక కావచ్చు. శాంసంగ్ ఏడేళ్ల అప్​డేట్స్​ని హామీ ఇస్తోంది! ఇది టైటానియం బిల్డ్​ని కలిగి ఉంది. కొత్త 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ మినహా క్వాడ్-కెమెరా సెటప్​తో కెమెరా సెటప్​ కూడా పెద్దగా మారలేదు.

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్​ ఛానెల్స్​లో అందుబాటులో ఉంది. టెక్​ ప్రపంచం నుంచి లేటెస్ట్​ అప్డేట్స్​ కోసం వాట్సాప్​లో హెచ్​టీ తెలుగు ఛానెల్​ని ఫాలో అవ్వండి..

సంబంధిత కథనం