Black Friday Sale : ఈ శాంసంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 50వేల డిస్కౌంట్! ఇదే బెస్ట్ డీల్ గురూ..
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 50వేల డిస్కౌంటెడ్ ధరతో ఈ బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ని ఇక్కడ చూసేయండి..
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో అనేక ఫ్లాగ్‌షిప స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరకే దొరుకుతున్నాయి. వాటిల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ఒకటి! డిసెంబర్ 2 వరకు ఉండే సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. రూ. 50వేల వరకు డిస్కౌంటెడ్ ధరతో మీరు ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ని కొనొచ్చు. ఈ నేపథ్యంలో ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా డిస్కౌంట్..
బ్రాండ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌గా 2023లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా.. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ .1,24,999. అయితే 2024 అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఇది గణనీయమైన ధర తగ్గింపును అందుకుంది. గెలాక్సీ ఎస్23 అల్ట్రా డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో కలిపి కేవలం రూ.74,999కే లభిస్తోంది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.50,000 డిస్కౌంట్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా కొనాలా?
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 2023 టాప్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ ఒకటిగా నిలిచింది. ఈ గ్యాడ్జెట్.. దాని అధునాతన కెమెరా సామర్థ్యాలు, అసాధారణ పనితీరుతో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వంటి పరికరాలకు తీవ్రమైన పోటీని అందిస్తుంది. అదనంగా, గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ఇప్పుడు గెలాక్సీ ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.
పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ కలిగిన గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 10 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 10 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉన్నాయి. 45వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
కేవలం రూ.74,999 ధరకు శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లోని హై పర్ఫార్మెన్స్ , అత్యాధునిక ఏఐ ఫీచర్లు, అత్యద్భుత కెమెరా సామర్థ్యాలు వస్తుండటం నిజంగానే గ్రేట్ డీల్‌ని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం