Samsung: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍ల ధరలు లీక్.. ఐఫోన్ 14లాగే!-samsung galaxy s23 series price in india leaked before february 1 launch ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Samsung Galaxy S23 Series Price In India Leaked Before February 1 Launch

Samsung: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍ల ధరలు లీక్.. ఐఫోన్ 14లాగే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 29, 2023 05:06 PM IST

Samsung Galaxy S23 Series Price: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ మొబైళ్ల ప్రారంభ ధరలు ఎంత ఉంటాయన్న సమాచారం లీకైంది. ఆ వివరాలు ఇవే.

Samsung: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍ల ధరలు లీక్.. ఐఫోన్ 14లాగే!
Samsung: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్‍ల ధరలు లీక్.. ఐఫోన్ 14లాగే! (HT_Tech)

Samsung Galaxy S23 Series Price: లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ జనరేషన్ సిరీస్‍ను లాంచ్ చేసేందుకు పాపులర్ కంపెనీ సామ్‍సంగ్ (Samsung) సిద్ధమైంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‍ను ఫిబ్రవరి 1వ తేదీన విడుదల చేయనుంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23), గెలాక్సీ ఎస్23 ప్లస్ (Samsung Galaxy S23 Plus), గెలాక్సీ ఎస్‍23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) మొబైళ్లు ఈ సిరీస్‍లో ఉండనున్నాయి. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్‍23 అల్ట్రా టాప్ వేరియంట్‍గా ఉంటుంది. గెలాక్సీ అన్‍ప్యాక్డ్ ఈవెంట్ 2023 (Galaxy Unpacked 2023) ద్వారా ఈ సిరీస్‍ను సామ్‍సంగ్ లాంచ్ చేయనుంది. అయితే భారత్‍లో ఈ ఫోన్‍ల ప్రారంభ ధర ఎంత ఉంటుందనే విషయం విడుదలకు ముందే లీకైంది. ఆ వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ధరలు

Samsung Galaxy S23 Price: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ ధరలను టిప్‍స్టర్ యోగేశ్ బ్రార్ లీక్ చేశారు. సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ప్రారంభ ధర రూ.79,999గా ఉంటుందని పేర్కొన్నారు. ఇండియాలో ఐఫోన్ 14 ప్రారంభ ధర కూడా ఇంతే ఉంది. ఇక సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ ప్రారంభ ధర రూ.89,999, సామ్‍గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్రారంభ ధర రూ.1,14,999గా ఉంటుందని వెల్లడించారు.

2022లో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్22 లాంచ్ అయినప్పుడు దాని ప్రారంభ ధర రూ.72,999గా ఉండేది. అయితే ఇప్పుడు ఎస్23 ఫోన్ అంతకంటే రూ.5,000 ఎక్కువ ధరకు వస్తుందని దీన్ని బట్టి తెలుస్తోంది.

Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ మొబైళ్లు క్వాల్కామ్ స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి. ఇందులో గెలాక్సీ ఎస్23 అల్ట్రా గురించి మరిన్ని స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. 6.8 ఇంచుల క్వాడ్ హెచ్‍డీ 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్‍ప్లేతో ఈ టాప్ ఎండ్ మోడల్ వస్తుందని తెలుస్తోంది. డిస్‍ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే వెనుక ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం