Samsung Galaxy M54 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఎం54 5జీ స్పెసిఫికేషన్లు లీక్.. వివరాలివే-samsung galaxy m54 5g specifications tipped via geekbench ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Samsung Galaxy M54 5g Specifications Tipped Via Geekbench

Samsung Galaxy M54 5G: సామ్‍సంగ్ గెలాక్సీ ఎం54 5జీ స్పెసిఫికేషన్లు లీక్.. వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 30, 2022 05:16 PM IST

Samsung Galaxy M54 5G Specifications: గీక్‍బెంచ్ లిస్టింగ్ ద్వారా సామ్‍సంగ్ గెలాక్సీ ఎం54 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు కొన్ని బయటికి వచ్చాయి. ఈసారి ఈ ఎం సిరీస్ ఫోన్ విభిన్నమైన ప్రాసెసర్‌తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎం53 5జీ (Photo: Samsung)
సామ్‍సంగ్ గెలాక్సీ ఎం53 5జీ (Photo: Samsung)

Samsung Galaxy M54 5G tipped Specifications: సామ్‍సంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‍లో మంచి హిట్ అయింది. ఇప్పుడు దీనికి సక్సెసర్‌ను సామ్‍సంగ్ రూపొందిస్తోంది. త్వరలో సామ్‍సంగ్ గెలాక్సీ ఎం54 5జీ ఇండియాలో లాంచ్ కానుంది. అయితే తాజాగా ఈ ఫోన్‍కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. గీక్‍బెంచ్‍ (Geekbench) లో లిస్ట్ అవటంతో వివరాలు లీకయ్యాయి. ఎస్ఎం-ఎం546బీ మోడల్ నంబర్‌తో గీక్‍బెంచ్‍లో ఈ ఫోన్ లిస్ట్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Samsung Galaxy M54 5G: స్పెసిఫికేషన్లు!

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో సామ్‍సంగ్ గెలాక్సీ ఎం54 5జీ రానుంది. వన్‍యూఐ 5.0 ఓఎస్‍పై రన్ అవుతుంది. 8జీబీ వరకు ర్యామ్ ఉంటుంది. గీక్‍బెంచ్ టెస్టులో సింగిల్ కోర్ పై 750 పాయింట్లు, మల్టీ కోర్ టెస్టులో 2,696 పాయింట్లను ఈ మోడల్ స్కోర్ చేసింది. 6.7 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ సూపర్ అమోలెడ్ డిస్‍ప్లేతో ఎం54 5జీ వచ్చే అవకాశం ఉంది. 120 హెర్ట్జ్ వరకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండనుంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎం54 5జీ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుందని లీక్‍ల ద్వారా వెల్లడైంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయని తెలుస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తుందని సమాచారం. వైఫై 6ఈ, ఇన్‍డిస్‍ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండనున్నాయి.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎం53 5జీ.. మీడియాటెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్‌ను కలిగి ఉండగా.. తదుపరి రాబోయే ఎం54 5జీ ఫోన్‍లో ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. సామ్‍సంగ్ కొత్తగా రూపొందిస్తున్న ఎగ్జినోస్ 1380 చిప్‍తో ఈ ఫోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

సామ్‍సంగ్ గెలాక్సీ ఎం53 5జీ ఫోన్‍ను ఈ ఏడాది మొదట్లో సామ్‍సంగ్ లాంచ్ చేసింది. 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‍ప్లే, 120హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‍ను ఈ ఫోన్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ మొబైల్ రన్ అవుతోంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఉంది. 5000mAh బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍ను కలిగి ఉంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎం53 5జీ ప్రారంభ ధర ప్రస్తుతం రూ.24,990గా ఉంది.

WhatsApp channel

టాపిక్