Samsung Galaxy Discount : న్యూ ఇయర్‌కు కిర్రాక్ ఆఫర్.. శాంసంగ్ గెలాక్సీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
Samsung Galaxy M35 5G Discount : కొత్త ఏడాదిలో ఫోన్ తీసుకోవాలనుకునేవారి కోసం చాలా ఆఫర్లు నడుస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎం35 ఫోన్ మీద భారీ డిస్కౌంట్ నడుస్తోంది.
కొత్త సంవత్సరానికి కొత్త ఫోన్ ప్లాన్ చేస్తే మీ కోసం శాంసంగ్ అదిరే డిస్కౌంట్ తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌సో బంపర్ ఆఫర్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎం35 ఫోన్ కొనుగోలుపై 37 శాతం తగ్గింపు ప్రకటించింది. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్లు, ఫీచర్లను చూద్దాం..
ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎం35 ఫోన్ 6000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఇది Exynos 1380 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోల్ ఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ రక్షణను కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం35 మొబైల్ Exynos 1380 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది గ్రాఫిక్స్ కోసం Mali G68 MP5 జీపీయూతో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6 ఓఎస్‌లో పనిచేస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం35 ఫోన్‌లో 6జీబీ ప్లస్ 128జీబీ, 8జీబీ ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్ సహాయంతో స్టోరేజీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం 31 శాతం డిస్కౌంట్ ఆఫర్ 8జీపీ ప్లస్ 128జీబీ మీద ఉందని గుర్తుంచుకోవాలి.
కెమెరా వివరాలు
శాంసంగ్ గెలాక్సీ ఎం35 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మూడో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మొబైల్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 6,000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ధరలు
శాంసంగ్ గెలాక్సీ ఎం35 ఫోన్ 6జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ 31 శాతం డిస్కౌంట్‌తో రూ.17,790కి దొరుకుతుంది. దీని అసలు ధర రూ.25,999. 8జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.26,990గా ఉంది. దీనిపై 1 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది.
గమనిక : ఫోన్ల డిస్కౌంట్ ఆఫర్ రోజురోజుకు మారుతూ ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆఫర్ ఆధారంగా కథనం ఇచ్చాం. భవిష్యత్తులో ఈ ధరలు మారవచ్చు.