రూ. 43 వేల శాంసంగ్ స్మార్ట్ ఫోన్ రూ. 27 వేలకే; ఇంకా చాలా ఆఫర్స్-samsung galaxy a55 5g galaxy m16 5g and more get big price cuts in samsung offer from may 1st ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  రూ. 43 వేల శాంసంగ్ స్మార్ట్ ఫోన్ రూ. 27 వేలకే; ఇంకా చాలా ఆఫర్స్

రూ. 43 వేల శాంసంగ్ స్మార్ట్ ఫోన్ రూ. 27 వేలకే; ఇంకా చాలా ఆఫర్స్

Sudarshan V HT Telugu

శాంసంగ్ తన గెలాక్సీ ఏ, ఎం, ఎఫ్ సిరీస్ కు చెందిన పలు స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. మే 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆఫర్ ఆన్ లైన్ లో, రిటైల్ స్టోర్లలో లభించే ఎంపిక చేసిన మోడళ్లకు వర్తిస్తుంది. ఈ పరిమిత కాల ఆఫర్లో భాగంగా గెలాక్సీ ఏ55 5జీ ధర రూ.42,999 నుంచి రూ.26,999కు తగ్గింది.

శాంసంగ్ స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ ఆఫర్స్ (Amazon)

శాంసంగ్ గెలాక్సీ ఏ, ఎం, ఎఫ్ సిరీస్ కు చెందిన పలు స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మే 1 నుంచి శాంసంగ్ అధికారిక ఛానెల్స్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఇతర రిటైల్ అవుట్ లెట్ లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పరిమిత కాల ఆఫర్ లో భాగంగా గెలాక్సీ ఏ55 5జీ ధర రూ.42,999 నుంచి రూ.26,999కు తగ్గింది. గతంలో రూ.33,999గా ఉన్న గెలాక్సీ ఏ35 5జీ రూ.19,999కే లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ ఫోన్స్ పై డిస్కౌంట్స్

  • శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ, ఏ35 5జీ ఫోన్లలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉన్న 6.6 అంగుళాల ఎఫ్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది.
  • వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు ఓఐఎస్, మాక్రో, అల్ట్రా వైడ్ సెన్సార్లు, 32 మెగా పిక్సెల్, 13 మెగా పిక్సెల్ (ఎ35) ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.
  • ఎ55 ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ పై, ఎ35 ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ పై పనిచేస్తాయి. 25వాట్ ఛార్జింగ్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
  • గెలాక్సీ ఎం35 5జీలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ విక్టస్+ స్క్రీన్, ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ ఉన్నాయి. ఇందులో వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం, ఎఫ్ సిరీస్ లపై

గతంలో రూ.15,999గా ఉన్న గెలాక్సీ ఎం16 5జీ ధర ఇప్పుడు డిస్కౌంట్ లో భాగంగా రూ.10,749 లకు లభిస్తుంది. అలాగే, గతంలో రూ.15,999గా ఉన్న గెలాక్సీ ఎఫ్16 5జీ ధర కూడా రూ.10,749 గా ఉంది. గతంలో అధిక ధరలకు లిస్ట్ అయిన గెలాక్సీ ఎం06 5జీ, ఎఫ్06 5జీ ఇప్పుడు రూ.8,199కే లభిస్తాయి.

  • గెలాక్సీ ఎం16 5జీలో 6.7 అంగుళాల ఎఫ్హెచ్డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది.
  • వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. గెలాక్సీ ఎం06 5జీలో 50 మెగాపిక్సెల్ వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి.
  • గెలాక్సీ ఎఫ్ 16 5జీలో సూపర్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా ఉన్నాయి. ఆరేళ్ల సాఫ్ట్ వేర్ సపోర్ట్ లభిస్తుందని శాంసంగ్ పేర్కొంది.
  • గెలాక్సీ ఎఫ్06 5జీలో 6.7 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50 ఎంపీ రియర్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.
  • ఈ ధరలు మే 1, 2025 నుండి అమల్లోకి వస్తాయి. శాంసంగ్ అధికారిక ఛానెల్స్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఇతర రిటైల్ అవుట్లెట్ల ద్వారా లభిస్తాయి.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం