Samsung Galaxy A34 launch : త్వరలోనే శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34 లాంచ్​..!-samsung galaxy a34 launch in india soon check expected features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Samsung Galaxy A34 Launch In India Soon: Check Expected Features Here

Samsung Galaxy A34 launch : త్వరలోనే శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34 లాంచ్​..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 22, 2023 03:33 PM IST

Samsung Galaxy A34 launch in India : ఇండియా మార్కెట్​లో మరో స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేయనుంది శాంసంగ్​. ఈ స్మార్ట్​ఫోన్​ పేరు శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34 వచ్చేస్తోంది!
శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34 వచ్చేస్తోంది! (AP)

Samsung Galaxy A34 launch : ఇండియా మార్కెట్​లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు దిగ్గజ స్మార్ట్​ఫోన్​ సంస్థ శాంసంగ్​ కృషిచేస్తోంది. ఇప్పటికే పలు మోడల్స్​ను లాంచ్​ చేసిన ఈ సౌత్​ కొరియన్​ సంస్థ.. ఇప్పుడు మరో స్మార్ట్​ఫోన్​ను ఇండియాలో లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34 స్మార్ట్​ఫోన్​.. త్వరలోనే ఇండియాలో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​.. యూఎస్​ ఎఫ్​సీసీ, ఇండియన్​ బీఐఎస్​తో పాటు వివిధ వెబ్​సైట్స్​లో ఇప్పటికే లిస్ట్​ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34.. ఎలా ఉంటుందంటే..!

మిడ్​- రేంజ్​ సెగ్మెంట్​లో ఈ శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34 స్మార్ట్​ఫోన్ వస్తుందని సమాచారం. దీని ధర రూ. 30వేలలోపే ఉంటుందని తెలుస్తోంది. ఈ గ్యాడ్జెట్​కు సంబంధించిన ఫీచర్స్​ ఇప్పటికే ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి.

Samsung Galaxy A34 features : గిజ్​మోచైనా నివేదిక ప్రకారం.. ఈ శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34 స్మార్ట్​ఫోన్ యూరోపియన్​ మోడల్​లో.. మీడియాటెక్​ డైమెన్షిటీ 1080 ప్రాసెసర్​ ఉంటుంది. ఇతర మార్కెట్​లలో ఎక్సినోస్​ 1280 చిప్​సెట్​ ఉండనుందని సమాచారం.

ఈ స్మార్ట్​ఫోన్​లో 6.5 ఇంచ్​ అమోలెడ్​ స్క్రీన్​ ఉండనుంది. టాప్​లో డ్యూ డ్రాప్​ నాచ్​ ఉండే అవకాశం ఉంది. 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​ కూడిన డిస్​ప్లే ఉండొచ్చు. శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34 స్మార్ట్​ఫోన్​లో డిజైన్​ చాలా సింపుల్​గా ఉంటుందని, రేర్​లో కెమెరా బంప్​ వంటివి ఉండవని సమాచారం.

Samsung Galaxy A34 price in India : ఇక ఈ శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ34 స్మార్ట్​ఫోన్​లో 48ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. మెయిన్​ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు ఉండొచ్చు. ఇక సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉండొచ్చు. ఇందులో 5000 ఎంఏఏహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుందని సమాచారం. 25డబ్ల్యూ ఫాస్ట్​ ఛార్జింగ్​ను ఇది సపోర్ట్​ చేస్తుంది. అయితే.. రీటైల్​ బాక్స్​లో వాల్​ ఛార్జర్​ ఉండకపోవచ్చు. ఇన్​-డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​ వంటి ఫీచర్స్​ వస్తాయి.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ.. ఏ23 5జీ..

Samsung Galaxy A14 5G price : ఇండియా మార్కెట్​లో ఇటీవలే గ్యాలెక్సీ ఏ సిరీస్​ను లాంచ్​ చేసింది శాంసంగ్​. ఇందులో గ్యాలెక్సీ ఏ14 5జీ, గ్యాలెక్సీ ఏ23 5జీ మోడల్స్​ ఉన్నాయి. ఇవి ఇప్పటికే సేల్​లోకి వచ్చాయి. శాంసంగ్​ ఇండియా ఆన్​లైన్​ స్టోర్​తో పాటు ఆఫ్​లైన్​ రీటైల్​ స్టోర్స్​లోను ఈ ఫోన్స్​ను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ స్మార్ట్​ఫోన్స్​కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel