Samsung Galaxy A25 : సామ్సంగ్ కొత్త మిడ్- రేంజ్ స్మార్ట్‌ఫోన్.. గెలాక్సీ ఏ25 ఫీచర్స్ ఇవే!
Samsung Galaxy A25 : సామ్సంగ్ కొత్త మిడ్- రేజ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఈ గెలాక్సీ ఏ25 ఫీచర్స్పై ఇప్పటివరకు ఉన్న వివరాలు మీకోసం..
Samsung Galaxy A25 : సరికొత్త మిడ్- రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ని సామ్సంగ్ సంస్థ సిద్ధం చేస్తోందని సమాచారం. దీని పేరు గెలాక్సీ ఏ25. ఇదొక 5జీ గ్యాడ్జెట్. ఈ మోడల్ ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఆ వివరాలు..
సామ్సంగ్ గెలాక్సీ ఏ25 5జీ ఫీచర్స్ ఇవేనా..?
రూమర్స్, లీక్స్ ప్రకారం.. సామ్సంగ్ గెలాక్సీ ఏ25లో ఎక్సినోస్ 1280 చిప్సెట్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ గ్యాడ్జెట్లో 13ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉండొచ్చు. వాటర్ డ్రాప్ స్టైల్ డిజైన్‌తో కూడిన 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే.. ఇందులో ఉండే అవకాశం ఉంది.
Samsung Galaxy A25 price in India : ఇతర ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ25 5జీలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వస్తుంది. 5జీ కనెక్టివిటీ ఫీచర్స్ ఇందులో ఉంటాయి. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ వంటి రెండు వేరియంట్లు.. ఈ సామ్సంగ్ మొబైల్లో ఉంటాయి.
ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయినట్టు సమాచారం. ఈ మొడల్ ప్రారంభ ధర రూ. 26,800- 35,800 మధ్యలో ఉండొచ్చని టాక్ నడుస్తోంది.
Samsung Galaxy A25 features : ఈ సామ్సంగ్ ఏ25 5జీకు చెందిన ఇతర ఫీచర్స్, ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేదు. లాంచ్ డేట్‌పైనా క్లారిటీ లేదు. కాకపోతే.. అంతర్జాతీయ లాంచ్ తర్వాత, ఈ మోడల్ ఇండియాలోకి అడుగుపెడుతుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్పై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఒప్పో రెనో 11 లాంచ్‌కు సిద్ధం..!
రెనో 11 సిరీస్‌ని ఒప్పో సంస్థ తయారు చేస్తున్న సమాచారం. చైనా మార్కెట్లో లాంచ్‌కు ఈ సిరీస్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కీలక ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ప్రో మోడల్లో.. కర్వ్డ్ ఎడ్జ్‌తో కూడిన ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుందట. 1.5కే రిసొల్యూషన్ దీని సొంతం. ఈ గ్యాడ్జెట్లో డైమెన్సిటీ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్సెట్ ఉండనుందని టాక్ నడుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం