Samsung Galaxy A15 Discount : శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్.. 28 శాతం వరకు డిస్కౌంట్!-samsung galaxy a15 with 6gb ram smartphone offer you can buy with 28 percent discount ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Galaxy A15 Discount : శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్.. 28 శాతం వరకు డిస్కౌంట్!

Samsung Galaxy A15 Discount : శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్.. 28 శాతం వరకు డిస్కౌంట్!

Anand Sai HT Telugu
Jan 08, 2025 09:58 AM IST

Samsung Galaxy A15 Discount : శాంసంగ్ ఫోన్ కొనాలనుకునేవారి కోసం మంచి మంచి ఆఫర్లు నడుస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ15 ఫోన్ మీద కూడా డిస్కౌంట్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ డిస్కౌంట్
శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ డిస్కౌంట్

శాంసంగ్ గెలాక్సీ ఏ15 స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై కంపెనీ 28 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. బ్యాంక్ కార్డ్‌లపై 5 శాతం తగ్గింపును పొందవచ్చు. మీరు ఈ మొబైల్‌ను రూ.14,500లోపే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆఫర్, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..

yearly horoscope entry point

డిస్కౌంట్ వివరాలు

శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ మొబైల్ 50 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్షన్ 6100 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఇది 6జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్, 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ కొనుగోలుపై 5,600 వరకు సేవ్ చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ బ్లూ అసలు ధర రూ. 19999గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 28 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో 14,399కే కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు

శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమెల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2,340 x 1,080 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత వన్ యూఐ 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది ఎల్ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. అదనంగా 5-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ మూడో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని ఛార్జ్ చేయడానికి, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీలో మొబైల్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

గమనిక : డిస్కౌంట్ ధరలు రోజురోజుకు మారుతూ ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆఫర్ ఆధారంగా ధరలు ఇచ్చాం. కొనేముందు డిస్కౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి.

Whats_app_banner