Samsung Galaxy A14 5G : శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!-samsung galaxy a14 5g launched in india check price specifications and full features list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Samsung Galaxy A14 5g Launched In India, Check Price, Specifications And Full Features List

Samsung Galaxy A14 5G : శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ లాంచ్​.. ధర ఎంతంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 17, 2023 07:19 AM IST

Samsung Galaxy A14 5G launched in India : శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ మోడల్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ధర, ఫీచర్స్​ వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఇండియాలో శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ లాంచ్​
ఇండియాలో శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ లాంచ్​

Samsung Galaxy A14 5G launch : ఇండియా మొబైల్​​ మార్కెట్​లో.. వరుస లాంచ్​లతో బిజీబిజీగా ఉంటోంది దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ శాంసంగ్​. ఓవైపు గ్యాలెక్సీ ఎస్​23 సిరీస్​ను లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూనే.. మరోవైపు ఓ బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను ఇండియాలో సైలెంట్​గా విడుదల చేసింది. అదే.. శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ. ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ స్పెసిఫికేషన్స్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ- ఫీచర్స్​..

Samsung Galaxy A14 5G features : ఇందులో 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. ఈ గ్యాడ్జెట్​లో ఎక్సినోస్​ 1330 ఆక్టా- కోర్​ ప్రాసెసర్​ ఉంది. ర్యామ్​ ప్లస్​ ఫీచర్​తో కూడిన 16జీబీ ర్యామ్​ ఉండటం విశేషం. ర్యామ్​ ప్లస్​ ఫీచర్​ కారణంగా.. అదనంగా వర్చువల్​ ర్యామ్​ను యాడ్​ చేసుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఇక ఈ శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీలో ప్రైవేట్​ షేర్​ అనే ఫీచర్​ కూడా ఉంది. దీని ద్వారా.. కస్టమర్లు బ్లాక్​చెయిన్​ టెక్నాలజీ సాయంతో ఇత గ్యాలెక్సీ వినియోగదారులతో ఫొటోలు, వీడియోలు భద్రంగా షేర్​ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. నాలుగేళ్ల పాటు ఈ ఫీచర్​కు సెక్యూరిటీ అప్డేట్స్​, 2 ఓఎస్​ అప్​గ్రేడ్స్​ వస్తున్నాయి!

రూ. 50వేల బడ్జెట్​లో మంచి స్మార్ట్​ఫోన్​ కొనాలని చూస్తున్నారా? అయితే శాంసంగ్​ నుంచి లభిస్తున్న ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇక ఫొటోగ్రాఫీ విషయానికొస్తే.. ఈ గ్యాలెక్సీ ఏ14 5జీలో 50ఎంపీ ట్రిపుల్​ లెన్స్​ రేర్​ కెమెరా ఉంటుంది. 13ఎంపీ సెల్ఫీ కెమెరా దీని సొంతం. 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీతో ఈ శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ వస్తోంది. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. రెండు రోజుల పాటు ఈ మొబైల్​ను వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది.

శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ- ధర..

Samsung Galaxy A14 5G price in India : ఈ శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ 4జీబీ ర్యామ్​- 64జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 16,499గా ఉంది. ఇక 6జీబీ ర్యామ్​- 128జీబీ స్టోరేజ్​ ధర రూ. 18,999గాను.. 8జీబీ ర్యామ్​ వేరియంట్​ ధర రూ. 20,999గాను ఉంది. శాంసంగ్​.కామ్​, శాంసంగ్​ ఎక్స్​క్లూజివ్​ పార్ట్నర్​ స్టోర్స్​తో పాటు వివిధ ఆన్​లైన్​ వేదికల్లో ఈ నెల 20 నుంచి ఈ స్మార్ట్​ఫోన్​ అందుబాటులో ఉండనుంది. అయితే.. ఈ నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు.. శాంసంగ్​.కామ్​లో నిర్వహించనున్న లైవ్​ కామర్స్​ ఈవెంట్​లో దీనిని దక్కించుకోవచ్చు.

Samsung Galaxy A14 5G : ఎస్​బీ, ఐడీఎఫ్​సీ, జెస్ట్​మనీతో ఈ స్మార్ట్​ఫోన్​పై రూ. 1500 వరకు క్యాష్​బ్యాక్​ లభిస్తోంది. రూ. 1382 నెలవారీ ఈఎంఐతో ఈ మొబైల్​ను కొనుగోలు చేసుకోవచ్చు. డార్క్​ రెడ్​, లైట్​ గ్రీన్​, బ్లాక్​ కలర్స్​లో ఈ శాంసంగ్​ గ్యాలెక్సీ ఏ14 5జీ లభిస్తుండటం విశేషం.

WhatsApp channel

సంబంధిత కథనం