Samsung Galaxy A05 : ఇండియా మార్కెట్లోకి మరో కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది సామ్సంగ్. దీని పేరు సామ్సంగ్ గెలాక్సీ ఏ05. రూ. 10వేల బడ్జెట్లోపు ఉన్న ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.
సామ్సంగ్ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ దీని సొంతం.
Samsung Galaxy A05 price in India : ఈ గ్యాడ్జెట్లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో కూడిన రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఇచ్చింది సామ్సంగ్.
ఈ డివైజ్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. డ్యూయెల్ సిమ్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ, జీపీఎస్, వైఫై, బ్లూటూత్ 5.3, టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ లభిస్తున్నాయి.
Budget friendly smartphones under ₹10000 : సామ్సంగ్ గెలాక్సీ ఏ05లో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి.. బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్. రెండు వేరియంట్స్‌లో ఈ మోడల్ అందుబాటులోకి వచ్చింది. 4జీబీ ర్యామ్- 64జీబీ స్టోరేజ్ ధర రూ. 9,999గా ఉంది. ఇక 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499గా ఉంది.
ఈ గ్యాడ్జెట్ కస్టమర్లను ఆకర్షిస్తుందని సామ్సంగ్ భావిస్తోంది.
Samsung Galaxy A05S price in India : సెప్టెంబర్‌లో.. సామ్సంగ్ గెలాక్సీ ఏ05ఎస్ పేరుతో ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌ని లాంచ్ చేసింది ఈ టెక్ సంస్థ. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 14999గా ఉంది. 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్, 2ఎంపీ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ రేర్‌లో వస్తోంది. అలాగే, 13ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం