Samsung Phones Discount : శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్.. ఎం సిరీస్ ఫోన్‌పై సూపర్ డీల్
Samsung Phones Offers : శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్, ఎం సిరీస్ 5జీ ఫోన్లపై భారీ డీల్ ఉంది. ఆఫర్లో మీరు ఈ ఫోన్లను 6 వేల రూపాయల వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. 10 శాతం క్యాష్ బ్యాక్, ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి. ఈ డీల్‌కు సంబంధించిన ఆఫర్లు చూద్దాం..
మీరు శాంసంగ్ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఇక ఆలస్యం చేయకండి. గెలాక్సీ ఏ సిరీస్, ఎం సిరీస్‌కు చెందిన 5జీ ఫోన్లపై కంపెనీ వెబ్‌సైట్ భారీ డీల్‌ను ప్రకటించింది. ఆఫర్‌లో మీరు ఈ పరికరాలను నేరుగా 6 వేల రూపాయల వరకు తక్షణ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. 10 శాతం క్యాష్ బ్యాక్‌తో ఈ ఫోన్లు మీ సొంతం చేసుకోవచ్చు. దీనితో పాటు కంపెనీ స్టూడెంట్ ఆఫర్లో 6 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ బోనస్‌లతో కూడా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ
ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ రూ.45,999గా నిర్ణయించింది. ఈ సేల్లో రూ.6 వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో నేరుగా కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ కోసం, మీరు ఎస్బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో చెల్లించాలి. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ కార్డు హోల్డర్లు ఈ ఫోన్ కొనుగోలుపై 10 శాతం క్యాష్ బ్యాక్ పొందుతారు. స్టూడెంట్ ఆఫర్‌లో ఫోన్‌పై 6 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఫోన్‌పై రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్.
శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ
ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ వెబ్‌సైట్‌లో రూ.33,999గా నిర్ణయించారు. ఎస్బీఐ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ఉపయోగించి ఫోన్ కొంటే రూ.5 వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫోన్ పై కంపెనీ 10 శాతం క్యాష్ బ్యాక్‌ను కూడా అందిస్తోంది. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. స్టూడెంట్ ఆఫర్లో 6 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ డివైజ్ ధరను రూ .20 వేల వరకు తగ్గించవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తోంది. దీని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. 25 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,499గా ఉంది. అన్ని బ్యాంకు కార్డులపై రూ.2 వేల ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే 10 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కంపెనీ 70శాతం బైబ్యాక్ స్కీమ్‌లో కూడా మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై కంపెనీ మంచి ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్.