ChatGPT Search: చాట్ జీపీటీ నుంచి ‘సెర్చ్ జీపీటీ’ లాంచ్; ఇది గూగుల్ కు డైరెక్ట్ చాలెంజ్-sam altmans openai launches chatgpt search directly challenging google ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Chatgpt Search: చాట్ జీపీటీ నుంచి ‘సెర్చ్ జీపీటీ’ లాంచ్; ఇది గూగుల్ కు డైరెక్ట్ చాలెంజ్

ChatGPT Search: చాట్ జీపీటీ నుంచి ‘సెర్చ్ జీపీటీ’ లాంచ్; ఇది గూగుల్ కు డైరెక్ట్ చాలెంజ్

Sudarshan V HT Telugu
Nov 01, 2024 03:50 PM IST

ChatGPT Search: గూగుల్ కు ఓపెన్ఏఐ సంస్థ నుంచి సవాలు ఎదురైంది. ఓపెన్ఏఐ కు చెందిన చాట్ జీపీటీ లో సెర్చ్ ఆప్షన్ ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ ఫౌండర్ శామ్ ఆల్ట్ మన్ ప్రకటించారు. ఈ కొత్త సెర్చ్ జీపీటీ ఫీచర్ ద్వారా యూజర్లు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయవచ్చు.

చాట్ జీపీటీ నుంచి ‘సెర్చ్ జీపీటీ’ లాంచ్
చాట్ జీపీటీ నుంచి ‘సెర్చ్ జీపీటీ’ లాంచ్ (X)

చాట్ జీపీటీ సెర్చ్ వర్షన్ ‘సెర్చ్ జీపీటీ’ ప్రోటో టైప్ ను ఓపెన్ఏఐ దీపావళి రోజున విడుదల చేసింది. దాంతో, ఇంటర్నెట్ సెర్చ్ లో మార్కెట్ లీడర్ అయిన గూగుల్ కు పోటీ ప్రారంభమైంది. ఓపెన్ఏఐ ప్రకారం, కొత్త సెర్చ్ జీపీటీ ఫీచర్ వినియోగదారులు సంబంధిత వెబ్ వనరులకు లింక్ లను ఉపయోగించడం ద్వారా వేగంగా, సకాలంలో సమాధానాలను పొందడానికి వీలు కల్పిస్తుంది. గతంలో, గూగుల్ లో దీని కోసం మీరు మళ్లీ సెర్చ్ ఇంజిన్ కు వెళ్లాల్సి వచ్చేది. ‘‘ఇది తాజా స్పోర్ట్స్ స్కోర్లు, వార్తలు, స్టాక్ కోట్స్, మరెన్నో వివరాలను ఫింగర్ టిప్స్ పై అందిస్తుంది’’ అని ఓపెన్ఎఐ తెలిపింది.

సెర్చ్ జీపీటీ వివరాలు

చాట్ జీపీటీ మన ప్రశ్నల ఆధారంగా వెబ్ ను బ్రౌజ్ చేసి సమాచారం ఇస్తుంది. లేదా రియల్ టైమ్ సమాధానాలను పొందడానికి వెబ్ సెర్చ్ ఐకన్ ను క్లిక్ చేయడం ద్వారా మ్యాన్యువల్ గా సెర్చ్ చేయవచ్చు. మరోవైపు, ఓపెన్ఏఐ చాట్ జీపీటీ -4 మోడల్ మెరుగైన వెర్షన్ తో పని చేసే చాట్ జీపీటీ (chatgpt) సెర్చ్, వెబ్ సోర్సెస్, వెబ్ లింక్ ల నుండి నేరుగా రియల్-టైమ్ సమాచారం మరియు చిత్రాలను అందిస్తుంది. స్పోర్ట్స్ స్కోర్లు, న్యూస్ అప్ డేట్స్, స్టాక్ ధర (SHARE PRICE)లు, మరెన్నో వివరాలను రియల్ టైమ్ సమాచారం పొందడానికి ఇది సహాయపడుతుంది. వీటిని విశ్వసనీయ వనరులకు లింక్ లతో అందిస్తారు. వినియోగదారులు తమ శోధనలను మెరుగుపరచడానికి ఫాలో-అప్ ప్రశ్నలను కూడా అడగవచ్చు.

చాట్ జీపీటీ సెర్చ్ ఒక పెయిడ్ సర్వీస్

ముఖ్యంగా, చాట్ జీపీటీ లోని చాలా ఫీచర్ల మాదిరిగా కాకుండా, చాట్ జీపీటీ సెర్చ్ పెయిడ్ సర్వీస్ గా ఉంటుంది. ఈ సెర్చ్ వెర్షన్ ప్రస్తుతం చాట్ జీపీటీ ప్లస్, టీమ్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. అంతేకాకుండా, సెర్చ్ జీపీటీ వెయిటింగ్ లిస్ట్ యూజర్లకు కూడా లభిస్తుంది. ఎంటర్ప్రైజ్, ఎడ్యు యూజర్లకు రాబోయే కొన్ని వారాల్లో దీని యాక్సెస్ లభిస్తుంది. రాబోయే నెలల్లో ఓపెన్ఏఐ తన ఫ్రీ యూజర్లందరికీ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. చాట్ జీపీటీ సెర్చ్ యూజర్లు కోరుకునే సమాధానాలను అందించడానికి భాగస్వామ్య ప్రొవైడర్ల నుంచి ప్రత్యక్ష కంటెంట్ తో పాటు థర్డ్ పార్టీ సెర్చ్ ఇంజిన్ల నుంచి సమాచారాన్ని ఇంటిగ్రేట్ చేస్తుంది.

Whats_app_banner