Sagility IPO: ఈ హెల్త్ కేర్ ఐపీఓకు అప్లై చేస్తున్నారా? ఈ రిస్క్స్ ఉన్నాయి.. గమనించండి!-sagility ipo 10 key risks investors should know before subscribing to the issue ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Sagility Ipo: ఈ హెల్త్ కేర్ ఐపీఓకు అప్లై చేస్తున్నారా? ఈ రిస్క్స్ ఉన్నాయి.. గమనించండి!

Sagility IPO: ఈ హెల్త్ కేర్ ఐపీఓకు అప్లై చేస్తున్నారా? ఈ రిస్క్స్ ఉన్నాయి.. గమనించండి!

Sudarshan V HT Telugu
Nov 05, 2024 03:06 PM IST

Sagility IPO: హెల్త్ కేర్ సర్వీస్ లో ఉన్న సజిలిటీ ఇండియా లిమిటెడ్ ఐపీఓ నవంబర్ 5 న ప్రారంభమైంది. ఈ ఐపీఓకు నవంబర్ 7 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ.28- రూ. 30 గా నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.945 కోట్లకు పైగా సమీకరించింది.

సజిలిటీ ఐపీఓ
సజిలిటీ ఐపీఓ (Photo: Courtesy company website)

Sagility IPO: హెల్త్ కేర్ రంగంలో టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తున్న సజిలిటీ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ సబ్ స్క్రిప్షన్ ను ఈ రోజు నవంబర్ 5, మంగళవారం ప్రారంభమైంది. నవంబర్ 7వ తేదీ గురువారంతో ఈ ఐపీఓ సబ్ స్క్రిప్షన్ ముగుస్తుంది. ఒక్కో షేరు ధర రూ.28-30 మధ్య ప్రైస్ బ్యాండ్ ను నిర్ణయించారు. ఈ పబ్లిక్ ఇష్యూలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.945 కోట్లకు పైగా సమీకరించారు.

స్పందన అంతంతమాత్రమే..

బిడ్డింగ్ ప్రారంభమైన తొలిరోజు, మంగళవారం, ఈ ఐపీఓ (Sagility IPO) కు ఇన్వెస్టర్ల నుంచి స్పందన కొంత మందకొడిగానే కనిపిస్తోంది. అయితే, రిటైల్ ఇన్వెస్టర్లు సానుకూలంగా స్పందిస్తున్నారని, ఉద్యోగులకు కేటాయించిన భాగం ఇప్పటికే పూర్తిగా సబ్ స్క్రైబ్ అయిందని సజిలిటి ఇండియా తెలిపింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ పూర్తిగా ప్రమోటర్ సజిలిటీ బివి ఆఫర్ ఫర్ సేల్. ఈ ఓఎఫ్ఎస్ ద్వారా 70.22 కోట్లను సమీకరించనున్నారు. సజిలిటీ బివి విలువ రూ .2,106.60 కోట్లుగా ఉంది. ఈ ఐపీఓ (IPO) పూర్తిగా ఓఎఫ్ఎస్ కాబట్టి, పబ్లిక్ ఆఫరింగ్ నుంచి కంపెనీకి ఎలాంటి నిధులు అందవు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తం వాటాదారులకు మాత్రమే వెళ్తాయి.

సజిలిటీ ఇండియా గురించి..

ఈ సంస్థ వినియోగదారులకు (ఆరోగ్య సేవా ఖర్చులను కవర్ చేసే, తిరిగి చెల్లించే యుఎస్ లోని ఆరోగ్య బీమా కంపెనీలు), ప్రొవైడర్లకు (ప్రధానంగా ఆసుపత్రులు, వైద్యులు, రోగనిర్ధారణ, వైద్య పరికరాలతో సంబంధం ఉన్న వ్యాపారాలు) టెక్నాలజీ ఆధారిత సేవలను అందిస్తుంది. మార్చి 31, 2024 నుంచి మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరాల్లో సజిలిటీ ఇండియా లిమిటెడ్ ఆదాయం 13 శాతం, పన్ను అనంతర లాభం (పీఏటీ) 59 శాతం పెరిగాయి. కంపెనీ తన రెడ్-హెర్రింగ్ ప్రాస్పెక్టస్ లో జాబితా వెల్లడించిన కొన్ని కీలక రిస్క్స్ ఇక్కడ ఉన్నాయి.

సజిలిటీ ఐపీఓ - ముఖ్యమైన రిస్క్స్

  • ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో చాలా పోటీ నెలకొని ఉంది. సరైన ప్రణాళిక, నిర్వహణ లేకపోతే సంస్థ వ్యాపారం, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
  • కంపెనీ ప్రత్యేకంగా యుఎస్ హెల్త్ కేర్ రంగంపై దృష్టి పెడుతుంది. యూఎస్ లో ఈ రంగాన్ని ప్రభావితం చేసే అంశాల ఆధారంగా దీని మనుగడ ఉంటుంది.
  • సంస్థ ముఖ్యమైన ఆస్తుల్లో గుడ్ విల్, ఇంటాంజిబుల్ అస్సెట్స్ కీలకమైనవి. వీటికి సంబంధించిన విలువలో ఏదైనా క్షీణత తక్షణమే ప్రభావం చూపుతాయి.
  • యూఎస్ లో ఔట్ సోర్సింగ్ కు వ్యతిరేకంగా చట్టం రూపొందితే, అది భారత్ సహా విదేశాల్లోని భాగస్వామ్య కంపెనీల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
  • యాజమాన్య లోపాలు, మేధో సంపత్తిని రక్షించడంలో వైఫల్యాలు సంస్థ ఆర్థిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
  • కంపెనీకి క్లయింట్లతో ఒప్పందాలు ముగిసినట్లయితే, అది వారి వ్యాపారం, ప్రతిష్ఠ, కార్యాచరణ ఫలితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
  • ఆదాయంలో గణనీయమైన భాగం యూఎస్ లోని కొన్ని పెద్ద క్లయింట్ గ్రూప్స్ నుండి వస్తుంది కాబట్టి, వారి వ్యాపారం మరియు లాభదాయకత ఈ కీలక క్లయింట్లతో బలమైన సంబంధాలను కొనసాగించడంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవి. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

Whats_app_banner