Safest Cars : బడ్జెట్ ధరలో వచ్చే ఈ కార్లు సేఫ్టీలోనూ టాప్.. ఓసారి లిస్ట్ చూసేయండి!
Safest Cars : భారతీయ ఆటోమెుబైల్ మార్కెట్‌లో బడ్జెట్ ధరలో అనేక కార్లు ఉన్నా్యి. అయితే మీరు ఏ కారు తీసుకుంటే బాగుంటుందో డిసైడ్ చేసుకోవాలి. మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో వచ్చే సేఫ్ కార్లు చూద్దాం..

భారతీయ కార్ల మార్కెట్‌లో రూ.10 లక్షల బడ్జెట్ లోపు కూడా మంచి మంచి కార్లు దొరుకుతాయి. ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ చేసి.. మంచి సేఫ్టీ రేటింగ్ ఇచ్చినా కార్లు తక్కువ ధరలో కూడా దొరుకుతాయి. మీరు కూడా రూ. 10 లక్షల లోపు సురక్షితమైన కారు కొనాలని ఆలోచిస్తుంటే.. ఈ కథనం మీ కోసమే. వాహనం భద్రతా రేటింగ్ కొనుగోలుదారులకు ఎంత సురక్షితమైనదో తెలియజేస్తుంది. బడ్జెట్ ధరలో మంచి సేఫ్టీ రేటింగ్‌తో వచ్చే కార్లు చూద్దాం..
టాటా పంచ్ ఈవీ
రూ. రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభమవుతుంది. వయోజన ప్రయాణికుల రక్షణలో 32 పాయింట్లలో 31.46 పాయింట్లను, పిల్లల ప్రయాణికుల రక్షణలో 49 పాయింట్లలో 45 పాయింట్లను సాధించింది. 5-స్టార్ రేటింగ్‌ను సంపాదించింది.
టాటా నెక్సాన్
రూ.7.99 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో ప్రారంభమయ్యే టాటా నెక్సాన్ కూడా సేఫ్టీ కారు. వయోజన, పిల్లల రక్షణలో పూర్తి 5 స్టార్ రేటింగ్‌ను సంపాదించింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెద్దల ప్రయాణికుల రక్షణలో 32 పాయింట్లకు 29.41 పాయింట్లను, పిల్లల ప్రయాణికుల రక్షణలో 49 పాయింట్లకు 43.83 పాయింట్లను సాధించింది.
టాటా కర్వ్
సరసమైన కూపే ఎస్‌యూవీ విభాగంలోని కొన్ని కార్లలో ఒకటైన టాటా కర్వ్‌ను రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు పెద్దలు, పిల్లల ప్రయాణికుల కోసం క్రాష్ టెస్టింగ్‌లో 5-స్టార్ రేటింగ్‌ను పొందింది. టాటా కారు నాణ్యత వారసత్వాన్ని ఇది కొనసాగిస్తుంది. పెద్దల ప్రయాణికుల రక్షణలో టాటా కర్వ్ 32కి 29.50, పిల్లల ప్రయాణికుల రక్షణలో 49కి 43.66 స్కోర్ సాధించింది. ఇది ఫంక్షనల్ పరీక్షలలో 24 కి 22.66 స్కోర్ చేసింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ అనేది సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. దీని ప్రారంభ ధర రూ. 7.79 లక్షలు. ఈ ధర ఎక్స్-షోరూమ్. భద్రత విషయానికి వస్తే మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్ఓ వయోజన రక్షణ పరీక్షలో 32కి 29.36, పిల్లల రక్షణ పరీక్షలో 49కి 43 స్కోర్ చేయడం ద్వారా 5-స్టార్ రేటింగ్‌ను పొందింది.
మారుతి సుజుకి డిజైర్
మారుతి సుజుకి డిజైర్ కారు ప్రారంభ ధర రూ. 6.79 లక్షలు(ఎక్స్-షోరూమ్). 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. వయోజన ప్రయాణికుల రక్షణ పరీక్షలో డిజైర్ 34 పాయింట్లకు 31.24 పాయింట్లు, పిల్లల ప్రయాణికుల రక్షణ పరీక్షలో 42 పాయింట్లకు 39.20 పాయింట్లు సాధించింది.
సంబంధిత కథనం