S A Tech Software India IPO: ఈ ఎస్ఎంఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అసాధారణ స్పందన; గంటలోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్
S A Tech Software India IPO: ఎస్ ఎ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా ఐపీఓ సబ్ స్క్రిప్షన్ కోసం జూలై 26, శుక్రవారం ప్రారంభమైంది. జూలై 30వ తేదీ వరకు ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజ్ కేటగిరీలోకి వచ్చే ఐపీఓ. జూలై 31న ఈ ఐపీఓ షేర్స్ అలాట్మెంట్ ఉండవచ్చు.
S A Tech Software India IPO: ఎస్ ఏ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) సబ్ స్క్రిప్షన్ కోసం శుక్రవారం ప్రారంభమైంది. ఎస్ ఏ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా ఐపీఓ అనేది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. జూలై 30వ తేదీ వరకు ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.
ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్
ఎస్ ఏ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా ఐపీఓకు అన్ని కేటగిరీల ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. శుక్రవారం మార్కెట్లోకి వచ్చిన గంటలోనే ఈ ఐపీఓ ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయింది. ఇప్పటివరకు మొత్తం 6.44 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. మధ్యాహ్నం 2:10 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపీఓలో 25.34 లక్షల షేర్లకు గాను 1.63 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ కేటగిరీలో 9.70 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) కేటగిరీలో 1.00 రెట్లు, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NII) కేటగిరీలో 6.12 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది.
ఎస్ ఏ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా ఐపీఓ జీఎంపీ
ఎస్ ఏ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా ఐపీఓ జీఎంపీ (GMP) లేదా గ్రే మార్కెట్ ప్రీమియం శుక్రవారం ఒక్కో షేరుపై రూ.70కి పెరిగిందని స్టాక్ మార్కెట్ (Stock market) నిపుణులు చెబుతున్నారు. అంటే గ్రే మార్కెట్లో ఎస్ ఏ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా షేరు ఇష్యూ షేర్ ధర (share price) అయిన రూ.59తో పోలిస్తే 118.64 శాతం ప్రీమియంతో రూ.129 వద్ద ట్రేడవుతోంది.
ఎస్ ఎ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా ఐపీఓ వివరాలు
ఎస్ ఎ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా ఐపీఓ (S A Tech Software India IPO) షేర్స్ అలాట్మెంట్ జూలై 31న జరిగే అవకాశముంది. అలాగే, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో ఈ కంపెనీ షేర్లు ఆగస్టు 2న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎస్ ఏ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా ఐపీఓ (IPO) ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరు ధర రూ.56 నుంచి రూ.59గా ఉంది. 39 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ అయిన బుక్ బిల్ట్ ఇష్యూ ద్వారా రూ.23.01 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఓ లాట్ పరిమాణం 2,000 షేర్లు. అంటే, రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేయడానికి అవసరమైన కనీస పెట్టుబడి మొత్తం రూ.1,18,000.
రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు
ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తాన్ని కంపెనీకి చెందిన కొన్ని బకాయి రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ముందస్తు చెల్లింపు లేదా తిరిగి చెల్లించడానికి ఉపయోగించాలని కంపెనీ ప్రతిపాదిస్తోంది. ఎస్ ఏ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా ఐపీఓకు లీడ్ మేనేజర్ గా జీవైఆర్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐపీవో రిజిస్ట్రార్ గా బిగ్ షేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తున్నాయి.
ఎస్ ఎ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా లిమిటెడ్ వివరాలు
ఎస్ ఎ టెక్ సాఫ్ట్ వేర్ ఇండియా అనేది విదేశీ సంస్థ ఎస్ ఎ టెక్నాలజీస్, యుఎస్ఎ కు ఐటి కన్సల్టింగ్ అనుబంధ సంస్థ. ఇది అప్లికేషన్ డెవలప్ మెంట్, మొబైల్ యాప్ డెవలప్ మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్ వేర్ క్వాలిటీ అస్యూరెన్స్, జనరేటివ్ ఏఐ, ఇతర సేవలను అందిస్తుంది. కంపెనీ ప్రమోటర్లుగా ఎస్ఏ టెక్నాలజీ- యూఎస్ఏ, మనోజ్ జోషి, ప్రియాంక జోషి ఉన్నారు. 2024 జూన్ తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.2.48 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్యూ1లో కంపెనీ ఆదాయం రూ.23.97 కోట్లుగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.3,68 కోట్లు, ఆదాయం రూ.72.38 కోట్లుగా ఉన్నాయి.