క్లాసిక్ బైక్‌లకు పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశిస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీ మొదటి ఈవీ లాంచ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 జనవరి లేదా మార్చి 2026 మధ్య భారత మార్కెట్‌లోకి రానుంది. ఫిబ్రవరి 2025లో కాన్సెప్ట్ రూపంలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఎస్6 స్క్రాంబ్లర్ ప్రవేశపెట్టనున్నారు. ఇది కంపెనీకి చెందిన రెండో ఎలక్ట్రిక్ మోడల్. వీటితో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త శకానికి నాంది పలుకుతుంది.
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 డిజైన్ రెట్రో బైక్ మాదిరిగా ఉండే అవకాశం ఉంది. ఆధునిక ఎలక్ట్రిక్ వెర్షన్‌తో వస్తాయి. ఇది వృత్తాకార ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, విలక్షణమైన టియర్‌డ్రాప్ ఆకారపు ట్యాంక్, ప్రత్యేకమైన గిర్డర్ ఫోర్క్‌లను కలిగి ఉంది. ఇవన్నీ దాని రెట్రో ఆకర్షణను మరింత ఆకట్టుకునేలా చేస్తాయి. బైక్ డిజైన్ బ్యాటరీ ప్యాక్‌కు అనుసంధానించేలా ఉంటుంది. ఈ మోడల్ ఒక ప్రత్యేకమైన సీటుతో కూడిన క్లీన్ సైడ్ ప్రొఫైల్, వెనుక సీటుతో విభిన్నంగా ఉంటుంది.
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100-150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనికి కారణం దాని మెరుగైన బ్యాటరీ ప్యాక్. దీన్ని తెలివిగా ట్యాంక్ కింద ఉంచారు. సీ6, ఎస్6 స్క్రాంబ్లర్ రెండూ ఈ బ్యాటరీ ప్యాక్‌ను పంచుకుంటాయని భావిస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీకి బ్రాండ్ వ్యూహాత్మక విధానాన్ని ప్రదర్శిస్తుంది.
ఫ్లయింగ్ ఫ్లీ సీ6 కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ వినూత్న సాంకేతికత, రైడర్-ఫ్రెండ్లీ ఫీచర్లతో వస్తుందని చెబుతున్నారు. ఇది 3.5-అంగుళాల వృత్తాకార టచ్‌స్క్రీన్ టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్, కాల్స్, ఎస్ఎంఎస్ కోసం నోటిఫికేషన్‌ల వంటి ఇతర ఫీచర్లను అందిస్తుంది.
వివిధ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ట్రికిల్, స్టాండర్డ్, రాపిడ్ అనే మూడు ఛార్జింగ్ మోడ్‌లకు మద్దతు ఇచ్చే అనుకూలమైన వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌తో వస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ బ్లీ సీ6, ఎస్6 స్క్రాంబ్లర్‌లో ఆధునిక సాంకేతికత, క్లాసికల్ డిజైన్‌తో వస్తుంది.