Royal Enfield Shotgun 650 Motoverse Edition : రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మంచి జోరు మీద ఉంది. హిమాలయన్ 450 బైక్‌ని తీసుకొచ్చిన ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.. అందరిని ఆశ్చర్యపరుస్తూ.. మరో వెహికిల్‌ని కూడా లాంచ్ చేసింది. అదే.. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
గోవా వేదికగా మోటోవర్స్ 2023 అనే ఈవెంట్‌ని నిర్వహిస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్. ఇందులో భాగంగా.. షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్‌ని లాంచ్ చేసింది. అయితే.. ఈ మోడల్‌కి సంబంధించి.. కేవలం 25 యూనిట్లను మాత్రమే రూపొందించనున్నట్టు సంస్థ ప్రకటించింది. మోటోవర్స్ ఈవెంట్లో పాల్గొన్న 25మందికి ఈ బైక్స్ కొనే అవకాశాన్ని ఇస్తున్నట్టు.. ఇందుకోసం లక్కీ డ్రా తీయనున్నట్టు వెల్లడించింది.
ఈ షాట్‌గన్ 650 కొత్త ఎడిషన్‌లో క్లాసిక్ బాబర్ డిజైన్ వస్తోంది. రౌండ్ హెడ్‌ల్యాంప్, వైడ్ హ్యాండిల్‌బార్‌తో పాటు బార్ ఎండ్ మిర్రర్స్, రైడర్ ఓన్లీ సాడిల్ (విత్ ఆప్షనల్ రేర్ సీట్ అసెంబ్లీ,), షార్ట్- వైడ్ రేర్ ఫెండర్, ఆల్-బ్లాక్ హార్డ్‌వేర్ ప్యాకేజ్ వంటివి వస్తున్నాయి. ఈ బైక్‌కి ఫుల్- ఎల్ఈడీ లైటింగ్ సిస్టెమ్, సెమీ-డిజిటల్ కన్సోల్, ట్రిప్పర్ నేవిగేషన్ మాడ్యూల్ వంటివి లభిస్తున్నాయి.
Royal Enfield Shotgun 650 : ఇక ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటోవర్స్ ఎడిషన్‌లో 649సీసీ, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్, పారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47 హెచ్‌పీ పవర్‌ని, 52 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. సూపర్ మిటియర్ 650 బైక్‌లో కూడా ఇదే ఇంజిన్ ఉంటుంది. ఆ మోడల్లో ఉన్నట్టుగానే.. కొత్త బైక్‌కి కూడా అలాయ్ వీల్స్, వైడ్ టైర్స్, ఇన్వర్టెడ్ ఫ్రెంట్ ఫోర్క్స్ వంటివి వస్తున్నాయి.
ఇక ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ ఎక్స్‌షోరూం ధర రూ. 4.25లక్షలు. లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కాబట్టి.. దీనికి మంచి డిమాండ్ ఉంటుందని సంస్థ భావిస్తోంది.
Royal Enfield Shotgun 650 price in India : రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450లో 450సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 450 హెచ్‌పీ పవర్‌ని, 40 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఈ వెహికిల్ బరువు 196కేజీలు. ఇందులో 17 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. 825ఎంఎం అడ్జెస్టెబుల్ సీట్ హైట్ లభిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం