Royal Enfield : యూత్‌కి కిక్కిచ్చే అప్‌డేట్.. 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 5 క్రేజీ మోటర్ సైకిళ్లు!
Royal Enfield Bikes : రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మోస్ట్ అవైటెడ్ క్లాసిక్ 650ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. 2025 జనవరిలో కంపెనీ దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే దీనితోపాటుగా 2025లో ఈ కంపెనీకి చెందిన మరికొన్ని బైకులు సందడి చేయనున్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతి సంవత్సరం తన కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. 2024లో షాట్ గన్ 650, గెరిల్లా 450, క్లాసిక్ గోవా 350, ఇంటర్‌సెప్టర్ బేర్ 650లను కూడా విడుదల చేశారు. ఇది కాకుండా వినియోగదారులు క్లాసిక్ 350 అప్‌డేట్ వెర్షన్‌ను కూడా చూశారు. 2025 సంవత్సరంలో కూడా కొత్త మోడళ్లను విడుదల చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. కొత్త ఏ బైకులను తీసుకురానుందో చూద్దాం..
స్క్రామ్ 440
రాయల్ ఎన్ ఫీల్డ్ ఇటీవల స్క్రామ్ 440ను ప్రదర్శించింది. స్క్రామ్ 440 టూ వీలర్ 443సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 25.4 బిహెచ్‌పీ పవర్, 34 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్క్రామ్ 440.. 2025 సంవత్సరంలో లాంచ్ కావచ్చని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
క్లాసిక్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ మోస్ట్ అవైటెడ్ క్లాసిక్ 650ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. 2025 జనవరిలో కంపెనీ దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ బైక్ 648సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 46.3 బీహెచ్పీ శక్తిని, 52.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
హిమాలయన్ 450 ర్యాలీ
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 ర్యాలీ వెర్షన్ ప్రస్తుత మోడల్ కంటే మంచి డిజైన్‌తో తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కొత్త ఎగ్జాస్ట్ ఎండ్-క్యాన్, అప్‌డేట్ చేసిన బాడీవర్క్‌తో రానుంది. న్యూస్ వెబ్సైట్ గాడివాడి నివేదిక ప్రకారం, ఈ మోటార్ సైకిల్ పూర్తిగా అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ సస్పెన్షన్ వంటి ఫంక్షనల్ అప్‌గ్రేడ్‌లను పొందే అవకాశం ఉంది.
బుల్లెట్ 650 ట్విన్
క్లాసిక్ 650 మాదిరిగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా బుల్లెట్ 650 ట్విన్ మోటార్ సైకిల్‌ను పరీక్షిస్తోంది. బుల్లెట్ 650 డిజైన్ కూడా బుల్లెట్ 350ను పోలి ఉంటుంది. క్లాసిక్ 650 మాదిరిగానే ఇది కూడా అదే కాంపోనెంట్స్, పవర్ట్రెయిన్ కలిగి ఉండే అవకాశం ఉంది.
కాంటినెంటల్ జీటీ 750
ఇంటర్‌సెప్టర్ 750 టెస్ట్ మ్యూల్ మాదిరిగానే కాంటినెంటల్ జీటీ 750 టెస్ట్ మ్యూల్ కూడా ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్ సెటప్‌తో కనిపిస్తుంది. అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లలో చూడవచ్చు. 2025లో కంపెనీ ఈ బైక్‌ను లాంచ్ చేయనుంది.
టాపిక్