Royal Enfield's Reown outlet: చవకగా రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొనాలా? ‘రీ ఓన్’ ట్రై చేయండి..
Royal Enfield's Reown outlet: ప్రి ఓన్డ్ (pre-owned) రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొనాలన్నా, మీ వద్ద ఉన్న రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను అమ్మాలన్నా.. ‘ రీ ఓన్ (Reown)’ ప్లాట్ ఫామ్ పై ఇప్పుడు సులభంగా పూర్తి చేయొచ్చు.

Royal Enfield's Reown outlet: రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ రీ ఓన్ (Reown) ఔట్ లెట్లను ప్రారంభించింది. ఈ ఔట్ లెట్ల ద్వారా మీరు మీ వద్ద నున్న పాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను అమ్మేయొచ్చు. లేదా ఎక్స్ చేంజ్ చేసి, కొత్త బైక్ కు అప్ గ్రేడ్ కావచ్చు. అలాగే, ఏదైనా సెకండ్ హ్యాండ్ లేదా ప్రి ఓన్డ్ (pre-owned) బైక్ ను కొనుగోలు చేయవచ్చు.
రీ ఓన్ ఔట్ లెట్స్
ఈ రీ ఓన్ ఔట్ లెట్స్ (Royal Enfield's Reown outlet) ను స్వయంగా రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థే ఆపరేట్ చేస్తుంది. ఔట్ లెట్స్ ద్వారానే కాకుండా, ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా కూడా మీ వద్ద నున్న పాత రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను అమ్మేయొచ్చు. లేదా ఎక్స్ చేంజ్ చేసి, కొత్త బైక్ కు అప్ గ్రేడ్ కావచ్చు. అలాగే, ఏదైనా సెకండ్ హ్యాండ్ లేదా ప్రి ఓన్డ్ (pre-owned) ఎన్ ఫీల్డ్ బైక్ ను కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం ఒక్కో కస్టమర్ కు ప్రత్యేకమైన రిలేషన్ షిప్ మేనేజర్ ను సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఆన్ లైన్ లో ఒక ఫామ్ ను ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. మెకానిక్ మీ ఇంటి వద్దకే వచ్చి, మీ బైక్ ను పరీక్షిస్తాడు. అలాగే, ప్రి ఓన్డ్ బైక్ ను కొనాలనుకునేవారు ఆన్ లైన్ లో బైక్స్ ను చెక్ చేసుకోవచ్చు. తమ వద్ద ఉన్న ప్రి ఓన్డ్ బైక్స్ కు రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ 200 లకు పైగా టెక్నికల్, మెకానికల్ పరీక్షలు నిర్వహిస్తుంది. అవసరమైన చోట నాణ్యమైన కంపెనీ పార్ట్స్ ను రీ ప్లేస్ చేస్తుంది. కంపెనీ సర్వీస్ సెంటర్ లో పూర్తి సర్వీసింగ్ చేసి ఉంచుతుంది.
బ్రాండ్ వారంటీ కూడా..
అదనంగా, ప్రీ-ఓన్డ్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసినవారికి బ్రాండ్ వారంటీతో పాటు రెండు ఫ్రీ సర్వీసింగ్ లను కూడా ఇస్తారు. రీ ఓన్ (Reown) ద్వారా తమ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను విక్రయించే కస్టమర్‌లు తమ తదుపరి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ కొనుగోలుపై రూ. 5,000 విలువైన లాయల్టీ ప్రయోజనాలు పొందుతారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్స్ఛేంజ్ కోసం కస్టమర్లు ఏదైనా ప్రీ-ఓన్డ్ మోటార్‌సైకిల్‌ను తీసుకురావచ్చని, వారి బైక్ కు మంచి ధర అందిస్తామని కంపెనీ చెబుతోంది.