350 సీసీ సెగ్మెంట్​లో ఈ రెండు బైక్స్​ బెస్ట్​! మరి మీరు ఏది కొనాలి?-royal enfield hunter 350 vs honda cb350 your guide to choose between these two ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  350 సీసీ సెగ్మెంట్​లో ఈ రెండు బైక్స్​ బెస్ట్​! మరి మీరు ఏది కొనాలి?

350 సీసీ సెగ్మెంట్​లో ఈ రెండు బైక్స్​ బెస్ట్​! మరి మీరు ఏది కొనాలి?

Sharath Chitturi HT Telugu

2025 రాయల్​ ఎన్​ఫీల్డ్​ హంటర్​ 350 వర్సెస్​ హోండా సీబీ 350.. ఈ రెండు బైక్స్​లో ఏది బెస్ట్​? 350 సీసీ సెగ్మెంట్​లో పోటీ పడుతున్న ఈ బైక్స్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

2025 రాయల్​ ఎన్​ఫీల్డ్​ హంటర్​ 350 వర్సెస్​ హోండా సీబీ 350..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని 350 సీసీ బైక్​ సెగ్మెంట్​కి విపరీతమైన డిమాండ్​ ఉంది. తాజాగా ఈ సెగ్మెంట్​లోనే 2025 హంటర్​ 350ని లాంచ్​ చేసి, ఇతర సంస్థలతో ఉన్న పోటీని మరింత పెంచింది దిగ్గజ ఆటోమొబైల్​ కంపెనీ రాయల్​ ఎన్​ఫీల్డ్​. ఈ నేపథ్యంలో 2025 హంటర్​ 350 అప్డేట్స్​తో పాటు.. ఈ సెగ్మెంట్​లో బెస్ట్​గా ఉన్న హోండా సీబీ 350తో ఈ బైక్​ని పోల్చి ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

2025 రాయల్​ ఎన్​ఫీల్డ్​ హంటర్​ 350..

2025 హంటర్ 350 బైక్​ని భారతదేశంలో ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రాయల్ ఎన్​ఫీల్డ్​. ఈ మోటార్ సైకిల్​ బేస్​ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేనప్పటికీ, టాప్​ వేరియంట్ ధర రూ .7,000 పెరిగింది! కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350 రెట్రో, డాపర్, రెబెల్ అనే మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. రెట్రో వేరియంట్ ధర రూ .1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్), డాపర్- రెబల్ ట్రిమ్స్ ధరలు వరుసగా రూ .1.77 లక్షలు (ఎక్స్-షోరూమ్), రూ .1.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)

ఈ బైక్​లో చేసిన ఇతర మార్పులతో పాటు, 2025 రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350 మూడు కొత్త కలర్ స్కీమ్​లలో కూడా లభిస్తుంది. దీంతో మొత్తం కలర్ ఆప్షన్స్​ సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ రెట్రో-థీమ్ బైక్​ అనేక కాస్మెటిక్, మెకానికల్ అప్​డేట్​లను పొందింది. ఇందులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, యూఎస్​బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి.

350 సీసీ బైక్​ సెగ్మెంట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎక్కువ భాగాన్ని కలిగి ఉండగా, ఇతర సంస్థలు కూడా తమ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఇప్పుడు 2025 రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350ని హోండా సీబీ 350తో పోల్చి చూద్దాము..

రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350 వర్సెస్ హోండా సీబీ 350: ధర..

రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350 ధర వేరియంట్లను బట్టి రూ .1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి రూ .1.82 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. మరోవైపు, హోండా సీబీ 350 రెండు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ .2 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ .2.18 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. హోండా సీబీ 350 బైక్​ రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350 టాప్ వేరియంట్ కంటే ఎక్కువ ధరతో వస్తుంది!

రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 వర్సెస్ హోండా సీబీ 350- స్పెసిఫికేషన్స్​..

2025 రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350 బైక్ 349 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్- ఆయిల్ కూల్డ్ ఇంజిన్​తో వస్తుంది. ఇది 19.72 బిహెచ్​పీ పీక్​ పవర్​, 27 ఎన్ఎమ్ పీక్​ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్ బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

మరోవైపు, హోండా సీబీ 350 బైక్​ 348.36 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్​తో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్​బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 20.78బీహెచ్​పీ పవర్, 29.5ఎన్ఎమ్ పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

కొత్తగా ప్రవేశపెట్టిన 2025 రాయల్ ఎన్​ఫీల్డ్​ హంటర్ 350 తో పోలిస్తే హోండా సీబీ 350 కొంచెం మెరుగైన పవర్స టార్క్ ఔట్​పుట్​ను అందిస్తుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం