Royal Enfield Guerrilla 450 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​-royal enfield guerrilla 450 teased for the first time global debut date fixed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Royal Enfield Guerrilla 450 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​

Royal Enfield Guerrilla 450 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​

Sharath Chitturi HT Telugu

Royal Enfield Guerrilla 450 launch date : రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి​ కొత్త బైక్ వస్తోంది. దాని పేరు రాయల్​ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450. ఈ బైక్​ లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. పూర్తి వివరాలు మీకోసం..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 (Instagram/Sid Lal)

భారత దేశ 2 వీలర్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చే బైక్స్​ కోసం కస్టమర్లు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు రాయల్​ ఎన్​ఫీల్డ్​ తన కొత్త బైక్​ లాంచ్​పై ఓ క్లారిటీ ఇచ్చింది​. రాయల్ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 మొదటి టీజర్​ను సైతం తాజాగా విడుదల చేసింది. అంతేకాదు.. ఈ బైక్​ లాంచ్​పై ఒక అప్డేట్​ ఇచ్చారు సంస్థ​ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్​ లాల్. 2024 జూలై 17న గొరిల్లా 450 గ్లోబల్ లాంచ్​ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ బైక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రాయల్ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 టీజర్..

రాయల్ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 కొత్త హిమాలయన్ ప్లాట్​ఫామ్ ఆధారంగా రూపొందుతున్న రెండో బైక్​. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన షెర్పా 450 ఇంజిన్​ ఉండనుంది.

కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 గురించి టీజర్​ ద్వారా అనేక కొత్త వివరాలు బయటపడ్డాయి. ఎల్ఈడీ హెడ్​ల్యాంప్, ఎల్ఈడీ ఇండికేటర్లను హిమాలయన్ నుంచి తీసుకురాగా, ఈ మోడల్లో యూఎస్డీలకు బదులుగా ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులను సంస్థ అమర్చింది. వెనుక భాగంలో ప్రీలోడ్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. కొత్త మోడల్​లో రౌండ్ డిజిటల్ ఇన్​స్ట్రుమంమెంట్ కన్సోల్ కూడా ఉంది. నావిగేషన్​ సహా అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్​ వచ్చే అవకాశం ఉంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ గొరిల్లా 450 స్పెసిఫికేషన్లు

గొరిల్లా 450 బైక్​లో ఫ్లాట్ హ్యాండిల్ బార్, రోడ్​ బయాస్డ్​ టైర్లతో అల్లాయ్ వీల్స్, డిఫరెంట్ రైడింగ్ ట్రయాంగిల్ ఉన్నాయి. ఈ కొత్త బైక్ ఆర్ఈ హిమాలయన్ 450 కంటే గణనీయంగా తేలికైనదని భావిస్తున్నారు. అయితే దీని బరువు ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇందులోని 452సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. హిమాలయన్​ బైక్​లో ఈ ఇంజిన్ సుమారుగా 39బిహెచ్​పీ పవర్, 40ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. గొరిల్లా 450లో కూడా ఇవే ఫిగర్స్​ ఉండొచ్చు. 6-స్పీడ్ గేర్ బాక్స్​ని మార్చే అవకాశం ఉంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ గొరిల్లా 450 లాంచ్​..

కొత్త రాయల్ ఎన్​ఫీల్డ్ గొరిల్లా 450 గురించి మరిన్ని వివరాలు వచ్చే నెలలో లభ్యం కానున్నాయి. గ్లోబల్ అరంగేట్రానికి ముందు మరిన్ని టీజర్లను ఆర్ఈ పంచుకునే అవకాశం ఉంది. ఇక ఇండియా లాంచ్​ కోసం కొంత కాలం ఆగల్సిందే అని తెలుస్తోంది! పండుగ సీజన్ సమయంలో ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ గొరిల్లా 450 ఇండియాలో లాంచ్​ అవ్వొచ్చు. కొత్త గొరిల్లా 450 బైక్​ ధర రూ .2.6 లక్షలకు పైగా (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.

లాంచ్​ సమయానికి ఈ బైక్​కి సంబంధించిన ఇతర వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

హార్లీ డేవిడ్​సన్ ఎక్స్ 440, ట్రయంఫ్ స్పీడ్ 400, బీఎమ్​డబ్ల్యూ జీ 310ఆర్, యెజ్డీ రోడ్​స్టర్ తదితర మోడళ్లతో ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ పోటీపడనుంది.

సంబంధిత కథనం