Most expensive car : ఇండియాలో ఈ రోల్స్ రాయిస్ కారు కొనాలంటే రూ. 9కోట్లు ఖర్చు చేయాల్సిందే..
Rolls Royce Ghost Facelift : రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 లగ్జరీ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఇండియాలోకి వచ్చేసింది. ఈ లగ్జరీ సెడాన్ ఫీచర్స్, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ తన పాపులర్ లగ్జరీ సెడాన్ అప్డేటెడ్ వర్షెన్‌ని ఇండియాలోకి తీసుకొచ్చింది. కొత్త ఘోస్ట్ ఫేస్‌లిఫ్ట్‌ని భారతదేశంలో ఇటీవలే ప్రవేశపెట్టింది. ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ .8.95 కోట్లు. ఎక్స్టెండెడ్ వేరియంట్ ధర రూ .10.19 కోట్లు. టాప్-స్పెక్ బ్లాక్ బ్యాడ్జ్ ధర రూ .10.52 కోట్లు. ఇవన్ని ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ లగ్జరీ సెడాన్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెలవరీలు 2025లో జరుగుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోల్స్ రాయిస్ లగ్జరీ కారు వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఫేస్‌లిఫ్ట్..
కల్లినన్ సిరీస్ 2 భారత మార్కెట్లోకి ప్రవేశించిన కొన్ని నెలల తర్వాత ఘోస్ట్ సిరీస్ 2 కూడా వచ్చేసింది. ఈ మోడల్ని సంస్థ ఈ సంవత్సరం ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఫేస్‌లిఫ్ట్ వర్షెనల్ ముందు బంపర్‌లో చిన్న గ్రిల్, మెయిన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చుట్టూ చుట్టిన ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కొత్త అల్లాయ్ వీల్స్‌తో రివైజ్డ్ ఫ్రంట్ ప్రొఫైల్ వస్తుంది. వెనుక భాగంలో రిఫ్రెష్డ్ డిజైన్‌తో పాటు వాహనం ఇరువైపులా టెయిల్ లైట్లు వస్తున్నాయి.
ఈ లగ్జరీ సెడాన్ క్యాబిన్లో గ్రే స్టెయిన్డ్ యాష్, డ్యూయాలిటీ ట్విల్ వంటి కొత్త మెటీరియల్స్ లభిస్తాయి. కొత్త డ్యూయాలిటీ ట్విల్ ఇంటీరియర్‌ని 2.2 మిలియన్ స్టిచెస్, 17.7 కిలోమీటర్ల థ్రెడ్ వర్క్‌తో పూర్తి చేయడానికి 20 గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది. రోల్స్ రాయిస్ కస్టమర్లు కస్టమైజేషన్ విషయానికి వస్తే అనేక ఆప్షన్స్‌ని పొందుతారు. ఆ ఆప్షన్స్ అన్ని ఒకదానికొకటి ప్రత్యేకంగా ఉంటాయి.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2లో డ్యాష్ బోర్డ్ వెడల్పును కవర్ చేసే కొత్త గ్లాస్ ప్యానెల్ కూడా ఉంది. వాహన తయారీ సంస్థ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ని కూడా అప్డేట్ చేసింది. ఇన్-కార్ కనెక్టివిటీ సిస్టమ్‌తో యూఐ అప్గ్రేడ్స్ని పొందింది. ఇది వెనుక ప్రయాణీకులు రెండు స్ట్రీమింగ్ పరికరాలను వారి స్క్రీన్లకు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. రేర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ హెడ్‌ఫోన్స్‌తో జత చేయవచ్చు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఇప్పుడు 1400-వాట్ల ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తుంది. ఇది మునుపటి వర్షెన్లలో కనిపించే 1300-వాట్ల వ్యవస్థను రిప్లేస్ చేస్తుంది.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2:
రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 లో 6.75-లీటర్ ట్విన్-టర్బో వీ12 ఇంజిన్ ఉంటుంది. స్టాండర్డ్, ఎక్స్టెండెడ్ వర్షెన్లలో ఇది 555 బీహెచ్పీ పవర్‌ని, 850 ఎన్ఎమ్ టార్క్‌ని కనెక్ట్ చేస్తుంది. బ్లాక్ బ్యాడ్జ్ వర్షెన్ 584 బీహెచ్పీ, 900 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. రెండు వర్షన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ చేసి ఉంటాయి.
రోల్స్ రాయిస్ ఘోస్ట్ బ్లాక్ బ్యాడ్జ్ బ్రేకింగ్ సిస్టెమ్ని కూడా మెరుగుపరిచింది. కొత్త 'లో' డ్రైవ్ మోడ్ కూడా ఉంది. ఇది థ్రోటిల్ 90 శాతం తెరిచి ఉన్నప్పుడు గేర్ ఛేంజెస్‌ని 50 శాతం వేగంగా చేస్తుంది.
సంబంధిత కథనం