RK Swamy IPO: రెండో రోజు రూ. 90 జీఎంపీతో దూసుకుపోతున్న ఐపీఓ; అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్-rk swamy ipo day 2 check gmp subscription status review more apply or not ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Rk Swamy Ipo Day 2: Check Gmp, Subscription Status, Review, More. Apply Or Not?

RK Swamy IPO: రెండో రోజు రూ. 90 జీఎంపీతో దూసుకుపోతున్న ఐపీఓ; అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

HT Telugu Desk HT Telugu
Mar 05, 2024 02:56 PM IST

RK Swamy IPO: ఆర్కే స్వామి ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఐపీఓ మార్కెట్లోకి వచ్చిన తొలిరోజే, గంటలోపే ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయి రికార్డు సృష్టించింది. ఈ ఐపీఓ లో రూ.173 కోట్ల తాజా ఇష్యూ, 8,700,000 ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఈ ఐపీఓకు అప్లై చేయడానికి మార్చి 6 లాస్ట్ డేట్.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

RK Swamy IPO Day 2: ఆర్కే స్వామి ఐపీఓ మార్చి 4వ తేదీ సోమవారం ప్రారంభమై మార్చి 6వ తేదీ బుధవారంతో ముగియనుంది. ఆర్కే స్వామి ఐపీఓ ప్రారంభమైన తొలిరోజే అద్భుతమైన ఆరంభం లభించింది. బిఎస్ ఇ డేటా ప్రకారం.. ఆర్ కె స్వామి ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్ మొదటి రోజు 2.19 రెట్లుగా ఉంది. ఓపెన్ అయిన మొదటి గంటలోనే, రిటైల్ భాగం పూర్తిగా బుక్ అయింది. మొదటి రోజు ముగిసే సమయానికి, రిటైల్ ఇన్వెస్టర్ పోర్షన్ 7.87 రెట్లు బుక్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

క్యూఐఐ లకే సింహభాగం

ఆర్కే స్వామి పబ్లిక్ ఇష్యూలో 75 శాతానికి తగ్గకుండా క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ కు, 15 శాతానికి మించకుండా నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 10 శాతానికి మించకుండా రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. రూ.7.50 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను ఉద్యోగుల వాటాగా రిజర్వ్ చేశారు. వారికి ఒక్కో షేరుపై రూ.27 డిస్కౌంట్ లభిస్తుంది.

ఐపీఓ వివరాలు..

ఈ ఐపీఓ (RK Swamy IPO) లో రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరు ధరను రూ.270 నుంచి రూ.288 వరకు నిర్ణయించారు. ఆర్కే స్వామి ఐపీఓ లాట్ పరిమాణం 50 ఈక్విటీ షేర్లు. ఇన్వెస్టర్లు లాట్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ కు రూ. 14,400 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ కె స్వామి ఒక డిజిటల్ డేటా ఆధారిత ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది. సంస్థ ఆదాయం సాధారణంగా హెచ్ 1 నుంచి 40 శాతం, హెచ్ 2 నుంచి 60 శాతం వస్తుందని గ్రూప్ సీఈఓ, హోల్ టైమ్ డైరెక్టర్ నరసింహన్ కృష్ణస్వామి తెలిపారు. సంస్థ కార్యకలాపాలను వేగవంతం చేసి రీసెట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఆర్కే స్వామి ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్

ఈ ఇష్యూ (RK Swamy IPO) రెండో రోజు రిటైల్ విభాగం నుంచి మంచి ఆసక్తి వ్యక్తమవుతోంది. బిఎస్ ఇ డేటా ప్రకారం, ఐపీఓ ప్రారంభమైన రెండో రోజు, మార్చి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయానికి, ఆర్ కె స్వామి ఐపీఓ సబ్ స్క్రిప్షన్ స్టేటస్ 4.02 రెట్లుగా ఉంది. ఇందులో రిటైల్ పార్ట్ 13.86 రెట్లు, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 5.87 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) 1 శాతం సబ్ స్క్రైబ్ అయ్యారు. ఉద్యోగి భాగం 1.15 రెట్లు సబ్ స్క్రైబ్ చేయబడింది. ఈ ఐపీఓ ద్వారా సమకూరిన మొత్తాన్ని కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, డిజిటల్ వీడియో కంటెంట్ ప్రొడక్షన్ స్టూడియోను స్థాపించడానికి కంపెనీ మూలధన వ్యయాలకు, ఐటీ మౌలిక సదుపాయాలకు, కంపెనీ మెటీరియల్ సబ్సిడరీలు, హన్సా రీసెర్చ్ మరియు హంసా కస్టమర్ ఈక్విటీ అభివృద్ధిలో పెట్టుబడులకు, కొత్తగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.

ఆర్కే స్వామి ఐపీఓ జీఎంపీ

ఆర్కే స్వామి ఐపీఓ జీఎంపీ లేదా గ్రే మార్కెట్ ప్రీమియం మార్చి 5వ తేదీన +90గా ఉంది. అంటే గ్రే మార్కెట్లో ఆర్కే స్వామి షేరు ధర రూ.90 ప్రీమియం వద్ద ట్రేడవుతోందని అర్తం. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ యొక్క ఎగువ ముగింపును, గ్రే మార్కెట్లో ప్రస్తుత ప్రీమియంను పరిగణనలోకి తీసుకొంటే, ఆర్కే స్వామి షేరు అంచనా లిస్టింగ్ ధర రూ .378 గా ఉంటుంది. ఇది ఐపీఓ గరిష్ట ఇష్యూ ధర రూ .288 కంటే 31.25% ఎక్కువ.

ఆర్కే స్వామి ఐపీఓ రివ్యూ

ఈ ఇష్యూను 'సబ్స్క్రైబ్' చేయాలని రిలయన్స్ సెక్యూరిటీస్ బ్రోకరేజీ సంస్థ సిఫారసు చేస్తోంది. ప్రైవేట్ కంపెనీలు తమ ఆదాయంలో 3% ఉత్పత్తి ఎండార్స్ మెంట్ కోసం ఖర్చు చేస్తున్నందున, ఆర్కే స్వామి సంస్థ రాబోయే సంవత్సరాల్లో స్థిరమైన వృద్ధిని సాధించే అవకాశముందని పేర్కొంది. మరోవైపు, మీడియా, క్రియేటివ్, డేటా అనలిటిక్స్, మార్కెట్ రీసెర్చ్ వంటి విస్తృత శ్రేణి సేవలను అందిస్తున్న ఆర్కే స్వామి ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చని కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సిఫారసు చేస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీ టాప్ లైన్ 19 శాతం సీఏజీఆర్ తో పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరానికి ఈబీఐటీఏ, పీఏటీ మార్జిన్లు వరుసగా 20.97 శాతం, 10.68 శాతంగా ఉన్నాయి.

సూచన: పైన చేసిన అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి. హిందుస్తాన్ టైమ్స్ తెలుగువి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

R K Swamy IPO details.
R K Swamy IPO details.
WhatsApp channel