Rishabh Pant accident : కార్లకు మంటలు ఎందుకు అంటుకుంటాయి? ఆ సమయంలో ఏం చేయాలి?-rishabh pant accident why cars catch fire and what to do at that time see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Rishabh Pant Accident, Why Cars Catch Fire And What To Do At That Time, See Details

Rishabh Pant accident : కార్లకు మంటలు ఎందుకు అంటుకుంటాయి? ఆ సమయంలో ఏం చేయాలి?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 31, 2022 07:21 AM IST

Rishabh Pant accident latest news : అసలు వాహనాలకు మంటలు ఎందుకు అంటుకుంటాయి? ఆ సమయంలో ఏం చేయాలి? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ప్రమాదానికి గురైన రిషభ్​ పంత్​ కారు..
ప్రమాదానికి గురైన రిషభ్​ పంత్​ కారు.. (HT_PRINT)

Rishabh Pant accident latest news : టీమ్​ఇండియా ఆటగాడు రిషభ్​ పంత్​కు జరిగిన ప్రమాదం.. దేశాన్ని షాక్​కు గురిచేసింది. శుక్రవారం తెల్లవారుజామున.. ఢిల్లీ- డెహ్రాడూన్​ హైవేపై ఈ ప్రమాదం చేటుచేసుకుంది. రిషభ్​ పంత్​ ప్రయాణిస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న అతడు.. అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చాడు. ఈ ఘటనలో రిషభ్​ పంత్​కు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో కార్లలో భద్రతా ప్రమాణాలపై మరోమారు చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో.. వాహనాలకు అసలు మంటలు ఎందుకు అంటుకుంటాయి? ఆ సమయంలో ఏం చేయాలి? అన్న విషయాలను తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

కార్లకు మంటలు ఎందుకు అంటుకుంటాయి?

సాధారణంగా.. వాహనాలు హైస్పీడ్​లో ఉండి, దేనినైనా ఢీకొంటే.. మంటలు చెలరేగుతాయి. రిషభ్​ పంత్​కు జరిగిన ప్రమాదంలోనూ ఇదే చోటుచేసుకుంది! మెర్సిడెస్​ జీఎల్​ఈ ఎస్​యూవీని అతను హైస్పీడ్​లో నడుపుతున్నట్టు సీసీటీవీ కెమెరాలు స్పష్టం చేశాయి. హైస్పీడ్​లోనే కారు.. ఓ డివైడర్​ను ఢీకొట్టింది. రిషభ్​ పంత్​ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా.. డీవైడర్​ను ఢీకొట్టిన కొద్ది క్షణాల్లోనే కారులో మంటలు వ్యాపించాయి.

Why do cars catch fire : వాహనాల తయారీలో వినియోగించే ప్లాస్టిక్​, ఫోమ్​, ఎలక్ట్రికల్​ వైరింగ్​, ఫాబ్రిక్​ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ఫైర్​ ఎక్స్​టింగ్యూషర్​ వంటి పరికరాలు వాహనాల్లో ఉండకపోవడం.. మరింత ఆందోళన కలిగించే విషయం.

ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఎవరూ చెప్పలేరు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఆ జాగ్రత్తలను తెలుసుకుందాము..

కారు నుంచి బయటపడాలి..

Rishabh Pant car accident : మంటలు అంటుకున్న వాహనం నుంచి ఎలాగైనా బయటపడాలి. అదే మొదటి ప్రయారిటీ. ఎంత ప్రయత్నించినా.. కారులో నుంచి బయటకు రాలేకపోతుంటే.. పదునైన పరికరాలతో అద్దాలను పగలగొట్టి, వెంటనే బయటపడాలి.

చిన్నపాటి మంట అంటుకున్నా.. అది క్షణాల్లోనే కారు మొత్తానికి వ్యాపిస్తుంది. అందుకే..ఫైర్​ ఎక్స్​టింగ్యూషర్​ను కారులో పెట్టుకోవడం ఉత్తమమైన విషయం.

బాధితులకు సాయం చేయాలి..

మంటలు అంటుకున్న కారు వద్ద మీరు ఉంటే.. లోపల ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నించాలి. రిషభ్​ పంత్​ విషయంలో.. స్థానికులు ఇదే చేశారు! ఫలితంగా అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

Car fire extinguisher : బాధితులు.. డోర్​ని లేదా సీట్​ బెల్ట్​ను తీయడానికి ఇబ్బంది పడుతుంటే.. పదునైన ఆయుధాలతో విండోలు బద్దలు కొట్టి, వారిని బయటకు లాగేయాలి.

ఫస్ట్​ ఎయిడ్​ కిట్​..

ఈ మధ్యకాలంలో.. చాలా వాహనాల్లో ఫస్ట్​ ఎయిడ్​ కిట్​లు ఉంటున్నాయి. స్వల్ప గాయాలైతే చికిత్స పొందే విధంగా ఇవి ఉంటాయి. అదే సమయంలో.. ఆలోవేరా జెల్​ వంటివి పెట్టుకుంటే.. చర్మ కాలినప్పుడు వాడుకోవచ్చు.

ఎమర్జెన్సీ సేవలు పొందాలి..

Rishab Pant latest news : చిన్నపాటి అగ్నిప్రమాదం అయితే.. ఫైర్​ ఎక్స్​టింగ్యూషర్​తో ఆపేయవచ్చు. ఆ తర్వాత రోడ్​సైడ్​ అసిస్టెన్స్​కు, బీమా సంస్థకు ఫోన్​ చేయవచ్చు. రిషభ్​ పంత్​ కారు.. గుర్తుపట్టలేని విధంగా, దారుణంగా దెబ్బతింది. ఈ సమయంలో అగ్నిమాపక సిబ్బందిని పిలవాల్సి ఉంటుంది. ట్రాఫిక్​ అధికారులను కూడా పిలిస్తే.. రోడ్డు మీద ట్రాఫిక్​కు అంతరాయం కలగదు!

మంటలు అంటుకున్న కారు నుంచి దూరంగా ఉండాలి..

మీ చుట్టుపక్కనా ఏదైనా కారుకు మంటలు అంటుకుంటే.. దాని నుంచి మీరు, మీ వాహనం దూరంగా ఉండాలి. లేకపోతే.. మీకు, మీ వెహికిల్​కి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

ఢిల్లీలో ఇటీవలే ఓ కారుకు మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు.. పక్కనే ఉన్న 20 వాహనాలకు వ్యాపించాయి. ఫలితంగా ఆ వాహనాలన్నీ మంటల్లో ఆహుతైపోయాయి!

WhatsApp channel