కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఆధారంగా లెక్కించే రీటైల్ ఇన్‌ఫ్లేషన్ అక్టోబరులో 6.77 శాతానికి తగ్గింది. సెప్టెంబరు మాసంలో ఇది 7.41 శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగువ సహన పరిమితి 6 శాతం కంటే ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉండడం ఇది వరుసగా పదో నెల.,ఆర్‌బీఐ సహన పరిమితి 2 నుంచి 6 శాతం మధ్య ఉంటుంది. 2026 నాటికి రీటైల్ ఇన్‌ప్లేషన్ 4 శాతంగా ఉండేలా ఆర్‌బీఐ చూడాల్సి ఉంటుంది. దీనికి 2 శాతం అటుఇటుగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెద్దగా సమస్య లేదు.,సీపీఐలో దాదాపు సగభాగం వెయిటేజీ ఉండే ఆహార ద్రవ్యోల్భణం సెప్టెంబరులో 8.60 శాతం ఉండగా.. అది అక్టోబరుకు 7.01 శాతానికి తగ్గింది. ,పరిశ్రమల ఉత్పత్తులను ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) గా కొలుస్తారు. ఇది సెప్టెంబరులో 3.1 శాతం వృద్ది రేటు నమోదు చేసింది. కాగా రాయిటర్స్ పోల్ అంచనాల్లో ఆర్థిక వేత్తలు అక్టోబరు మాసంలో సీపీఐ 6.40 శాతం నుంచి 7.35 శాతం మధ్య ఉంటుందని అంచనా వేశారు. మెజారిటీ ఆర్థిక వేత్తలు 7 శాతం దిగువన ఉంటుందని అంచనా వేశారు.,కాగా దేశంలో హోల్ సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్భణం 8.39 శాతానికి తగ్గింది. ఇది 19 నెలల కనిష్ట స్థాయి కావడం విశేషం. సెప్టెంబరులో 10.70 శాతంగా ఉన్న హోల్ సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్భణం అక్టోబరులో 8.70 శాతానికి తగ్గింది.,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధరలను అదుపులో పెట్టేందుకు మే నెల నుంచి ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 190 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచింది. అంటే 4 శాతం నుంచి 5.90 శాతానికి రెపో రేటును పెంచింది.,ద్రవ్యోల్భణం క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని రాయిటర్స్ పోల్ ఒకటి అంచనా వేసింది.,కమాడిటీల అధిక ధరలు, రూపాయి బలహీనత కారణంగా ద్రవ్యోల్భణం పెరుగుతూ వచ్చింది.