Telugu News  /  Business  /  Republic Day Offer You Can Buy Lava Probuds 21 Tws Earbuds For 26 Rupees On Amazon
Republic Day offer: రూ.26కే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్.. నేడు కాసేపే అవకాశం! (Photo: Lava)
Republic Day offer: రూ.26కే టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్.. నేడు కాసేపే అవకాశం! (Photo: Lava)

Republic Day offer: రూ.26కే టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్.. నేడు కాసేపే అవకాశం!.. సేల్ టైమ్ ఇదే..

26 January 2023, 7:39 ISTChatakonda Krishna Prakash
26 January 2023, 7:39 IST

Republic Day offer: రిపబ్లిక్ డే సందర్భంగా లావా ప్రోబడ్స్ 21 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ రూ.26కే అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆఫర్ సేల్ సమయంతో పాటు పూర్తి వివరాలు ఇవే.

Republic Day offer: రిపబ్లిక్ డే సందర్భంగా నేడు (జనవరి 26, గురువారం) ఓ బంపర్ ఆఫర్ అందుబాటులోకి రానుంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍(Amazon)లో ఓ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ మోడల్ భారీ డిస్కౌంట్‍కు లభించనుంది. రిపబ్లిక్ డే ఆఫర్ కింద రూ.26 ధరకే సేల్‍కు రానుంది. ఇంత భారీ ఆఫర్‌తో లావా ప్రోబడ్స్ 21 (Lava Probuds 21) లభించనుంది. అయితే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే రూ.26 ప్రత్యేక ధర ఉంటుందని లావా పేర్కొంది. ఈ ఆఫర్ ఎప్పుడు మొదలవుతుంది.. ఎక్కడ అందుబాటులోకి వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

లావా ప్రోబడ్స్ 21పై రిపబ్లిక్ డే ఆఫర్

Republic Day offer: ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon), లావా ఈ-స్టోర్‌ (Lava e-Store)లో నేటి (జనవరి 26) మధ్యాహ్నం 12 గంటలకు లావా ప్రోబడ్స్ 21 ఇయర్ బడ్స్ రూ.26 ధరకు అందుబాటులోకి వస్తాయి. స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని లావా పేర్కొంది. అంటే ఈ అవకాశం కాసేపు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మరి లావా ఎంత స్టాక్ ఆఫర్‌కు అందుబాటులోకి ఉంచుతుందో చూడాలి.

ఈ రిపబ్లిక్ డే ఆఫర్ విషయాన్ని అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా లావా ప్రకటించింది. రిపబ్లిక్ డే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆఫర్ మొదలవుతుందని పేర్కొంది. లావా ప్రోబడ్స్ 21 సాధారణ ధర రూ.1,499గా ఉంది.

లావా ప్రోబడ్స్ 21 స్పెసిఫికేషన్లు

Lava Probuds 21 TWS Earbuds: 12mm డైనమిక్ సౌండ్ డ్రైవర్లను లావా ప్రోబడ్స్ 21 ఇయర్‌బడ్స్ కలిగి ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.1 వెర్షన్‍తో వస్తుంది. గేమింగ్ కోసం 75mn అల్ట్రా ల్యాటెన్సీ మోడ్ ఉంటుంది.

లావా ప్రోబడ్స్ 21 ఇయర్‌బడ్స్ ఫుల్ చార్జ్‌పై 9 గంటల ప్లేబాక్ టైమ్ ఇస్తాయి. ఇక చార్జింగ్ కేస్‍తో మరో నాలుగుసార్లు చార్జ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా సుమారు 45 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఉంటుంది. 20 నిమిషాల చార్జింగ్‍తోనే 200 నిమిషాల ప్లేబ్యాక్ టైమ్ వచ్చేలా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్లకు ఈ బడ్స్ సపోర్ట్ చేస్తాయి.