ఫ్యామిలీ కోసం బెస్ట్ 7 సీటర్ కారు.. ధర కూడా మీకు అందుబాటులోనే-renault triber the best 7 seater car for family price is also affordable for you check out details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఫ్యామిలీ కోసం బెస్ట్ 7 సీటర్ కారు.. ధర కూడా మీకు అందుబాటులోనే

ఫ్యామిలీ కోసం బెస్ట్ 7 సీటర్ కారు.. ధర కూడా మీకు అందుబాటులోనే

Anand Sai HT Telugu

మీ ఫ్యామిలీ కోసం సరసమైన ధరలో 7 సీటర్ కారు చూస్తే.. మీరు రెనాల్ట్ ట్రైబర్‌ గురించి ఆలోచించవచ్చు. తక్కువ ధరకే ఎక్కువ స్థలం, మంచి ఫీచర్లతో వస్తుంది. కొనుగోలు చేసే ముందు స్పెసిఫికేషన్లు, మైలేజ్ వివరాలను తెలుసుకోండి.

రెనాల్ట్ ట్రైబర్‌ 7 సీటర్

ెనాల్ట్ ట్రైబర్ భారత మార్కెట్లో సరసమైన 7 సీటర్ కారు. ఈ 7 సీటర్ ఎంపీవీని కేవలం రూ.6.15 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. రెనాల్ట్ ఇండియాలో అత్యంత సరసమైన 7 సీటర్. ట్రైబర్‌ను FY2025లో మొత్తం 19,905 మంది కొత్త కస్టమర్లు కొనుగోలు చేశారు.

రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లు

రెనాల్ట్ ట్రైబర్ అనేక ఫీచర్లతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. దీనికి 182ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది. దీని కారణంగా ఇది ఏ రకమైన రోడ్డుపైనైనా సులభంగా నడుస్తుంది. ఇంకా 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, పవర్ విండోస్(ముందు, వెనుక), పవర్ అడ్జస్టబుల్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్లు, రెండో, మూడో వరుస కోసం AC వెంట్లు ఉన్నాయి. దీని మూడో వరుస సీట్లను అవసరమైతే తొలగించవచ్చు. ఇది 625 లీటర్ల వరకు పెద్ద బూట్ స్థలాన్ని అందిస్తుంది.

రెండో వరుస సీట్లు స్లయిడ్, రిక్లైన్, ఫోల్డ్-అండ్-టంబుల్ ఫంక్షన్లను పొందుతాయి. భద్రత కోసం, ట్రైబర్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు(టాప్ వేరియంట్లలో 4 ఎయిర్‌బ్యాగులు), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి అనేక ఇతర సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది.

ట్రైబర్ పవర్‌ట్రెయిన్

రెనాల్ట్ ట్రైబర్ 1.0-లీటర్ 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 72పీఎస్ పవర్, 96ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ (ఏఎంటీ) గేర్‌బాక్స్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ 7 సీట్ల కారు లీటరుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ధర వివరాలు

దేశీయ మార్కెట్లో, రెనాల్ట్ ట్రైబర్ ధర రూ. 6.15 లక్షల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమై టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.97 లక్షల వరకు ఉంటుంది. మీరు దీన్ని రెనాల్ట్ డీలర్‌షిప్ ద్వారా సీఎన్జీ కిట్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.