Best family car : ఇండియాలో లో- కాస్ట్​ బెస్ట్​ ఫ్యామిలీ 7 సీటర్​ ఇది- ఇప్పుడు సరికొత్తగా..-renault triber facelift spotted testing for the first time see details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Family Car : ఇండియాలో లో- కాస్ట్​ బెస్ట్​ ఫ్యామిలీ 7 సీటర్​ ఇది- ఇప్పుడు సరికొత్తగా..

Best family car : ఇండియాలో లో- కాస్ట్​ బెస్ట్​ ఫ్యామిలీ 7 సీటర్​ ఇది- ఇప్పుడు సరికొత్తగా..

Sharath Chitturi HT Telugu

Renault Triber facelift : రెనాల్ట్​ ట్రైబర్​ ఫేస్​లిఫ్ట్​ రెడీ అవుతోంది! ఈ ఏడాది చివరి నాటికి ఇది ఇండియాలో లాంచ్​ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రెనాల్ట్​ ట్రైబర్​ ఫేస్​లిఫ్ట్​

ఇండియాలో లో-కాస్ట్​ 7 సీటర్స్​లో ఒకటి రెనాల్ట్​ ట్రైబర్​. దీనికి ఫ్యామిలీ కారుగా మంచి గుర్తింపు ఉంది. ఈ ట్రైబర్​కిి ఫేస్​లిఫ్ట్​ని సంస్థ ప్లాన్​ చేస్తోంది. ఇక ఇప్పుడు రెనాల్ట్​ ట్రైబర్​ ఫేస్​లిఫ్ట్​పై తొలి టెస్టింగ్​ జరిగింది. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ సబ్ కాంపాక్ట్ ఎంపీవీలో చాలా మార్పులు ఉంటాయని వీటి ద్వారా తెలుస్తోంది. అప్డేటెడ్​ రెనాల్ట్​ ట్రైబర్​ ఈ సంవత్సరం చివరి నాటికి లాంచ్​ అవుతుందని సమాచారం. కొత్త స్పై షాట్ ఫ్లాట్-బెడ్​పై టెస్ట్ మ్యూల్​ని చూపిస్తున్నాయి.

2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్​లిఫ్ట్: అంచనాలు..

స్పై షాట్స్​ ఎక్కువగా ఈ బెస్ట్​ 7 సీటర్​ ఎంపీవీ వెనుక భాగాలను వెల్లడిస్తుంది. మొత్తం సిల్హౌట్ అలాగే ఉంటుంది. కానీ కొత్త ట్రైబర్ అప్డేటెడ్​ టెయిల్ లైట్లు, టెయిల్​గేట్, బంపర్లను పొందుతుంది. ఫ్రెంట్ కూడా సూక్ష్మమైన మార్పులను కలిగి ఉంటుందని ఆశించవచ్చు. మొత్తం మీద చూసుకుంటే.. ఇప్పుడున్న మోడల్​తో పోల్చితే, కొత్త మోడల్​లో భారీగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

2025 రెనాల్ట్ ట్రైబర్ ఫేస్​లిఫ్ట్: క్యాబిన్ అప్​గ్రేడ్స్​

క్యాబిన్​లో రీస్టైల్డ్ డ్యాష్​బోర్డ్, రివైజ్డ్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్, ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్​లు, మరింత సాఫ్ట్​టచ్ మెటీరియల్స్ సహా అనేక మార్పులు ఉంటాయి. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్​లిఫ్ట్​కు మరిన్ని ఫీచర్లను జోడించడం చూశాము కాబట్టి రెనాల్ట్ ట్రైబర్ ఫేస్​లిఫ్ట్ సైతం ఇలాంటి మార్పులనే చూసే అవకాశం ఉంది. మాగ్నైట్, ఖైగర్స ట్రైబర్ అన్నీ తమిళనాడులోని రెనాల్ట్-నిస్సాన్ అలయెన్స్​ ప్లాంటులో తయారవుతాయి. ఒకే వేదికపై ఆధారపడి ఉన్నాయని గమనించండి. రెనాల్ట్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మూడో వరుస సీటింగ్​ను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.

2025 రెనాల్ట్​ ట్రైబర్ ఫేస్​లిఫ్ట్: ఇంజిన్​ ఆప్షన్స్​..

కొత్త రెనాల్ట్ ట్రైబర్​లో చాలా మార్పులు కాస్మెటిక్​గా ఉండే అవకాశం ఉంది. మెకానికల్స్ అలాగే ఉంటాయి. ఇందులోని 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 71బీహెచ్​పీ పవర్, 96ఎన్ఎమ్ పీక్​ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ యూనిట్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. ట్రైబర్​లో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పట్లో అది సాధ్యం కాదని తెలుస్తోంది.

లాంచ్​ సమయం దగ్గరపడే కొద్దీ ఈ 7 సీటర్​ ఎంపీవీ ధరతో పాటు ఇతర వివరాలు అందుబాటులోకి వస్తాయి. వాటిని మేము మీకు అప్డేట్​ చేస్తాము.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం