Renault Kiger facelift : రెనాల్ట్​ ఖైగర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​- లాంచ్​కు రెడీ!-renault kiger facelift to be launched soon heres what to expect ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Renault Kiger Facelift : రెనాల్ట్​ ఖైగర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​- లాంచ్​కు రెడీ!

Renault Kiger facelift : రెనాల్ట్​ ఖైగర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​- లాంచ్​కు రెడీ!

Sharath Chitturi HT Telugu

రెనాల్ట్​ ఖైగర్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​కు రెడీ అవుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలు, అంచనాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ ఏడాదిలోనే రెనాల్ట్​ ఖైగర్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ లాంచ్​!

రెనాల్ట్ ఖైగర్ ఫేస్​లిఫ్ట్ త్వరలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రెనాల్ట్ ఇటీవల ఖైగర్ లైనప్​ను కొత్త ఫీచర్లు, వేరియంట్ కలయికతో అప్డేట్​ చేసింది. ఇక ఫుల్​ లెన్త్​ ఫేస్​లిఫ్ట్ వర్షెన్​ 2025 రెండో భాగంలో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.

రెనాల్ట్​ ఖైగర్​ ఫేస్​లిఫ్ట్​..

రెనాల్ట్ ఖైగర్ ఫేస్​లిఫ్ట్ ప్రస్తుత ఖైగర్ మాదిరిగానే సిల్హౌట్​ను నిలుపుకుంటుందని తెలుస్తోంది. అయితే, ఖైగర్ ఫేస్​లిఫ్ట్​లో సన్నని, సమాంతరంగా అలైన్ చేసిన ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు, రెస్టిల్డ్ రేడియేటర్ గ్రిల్, పునర్నిర్మించిన ఫ్రంట్ బంపర్ ఉంటాయి. షార్క్​ఫిన్ యాంటెనాను జోడిస్తుందని అంచనాలు ఉన్నాయి.

కొత్త 16 ఇంచ్​ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, క్లియర్-లెన్స్ ఎల్​ఈడీ టెయిల్ లైట్లు, రీవర్క్ చేసిన బంపర్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ ఎక్స్​టీరియర్​ వంటివి ఇతర ముఖ్య హైలైట్స్. వీటితో పాటు ఫేస్​లిఫ్టెడ్ ఖైగర్​లో రేర్ వైపర్, వాషర్, బంపర్​కు అనుసంధానించిన రీపోజిటెడ్ నంబర్ ప్లేట్ సెక్షన్, రిఫ్రెష్డ్ రెనాల్ట్ లోగో కూడా ఉంటాయని భావిస్తున్నారు.

రెనాల్ట్ ఖైగర్ ఫేస్​లిఫ్ట్: క్యాబిన్- ఫీచర్లు..

ఎక్స్​టీరియర్ మాదిరిగానే రెనాల్ట్ ఖైగర్ ఫేస్​లిఫ్ట్ క్యాబిన్ కూడా చాలావరకు ఒకేలా ఉంటుందని అంచనాలు ఉ న్నాయి. ఖైగర్ ఫేస్​లిఫ్ట్​లో వైర్​లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లేతో కూడిన 8-ఇంచ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టెమ్​ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

పుష్ బటన్ స్టార్ట్, రేర్ ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, అడ్జెస్టెబుల్ హెడ్రెస్ట్, ఫ్రంట్ అండ్ రేర్ ఆర్మ్​రెస్ట్​ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఖైగర్ ఫేస్​లిఫ్ట్ క్యాబిన్ కోసం విభిన్న కలర్ థీమ్​ను సంస్థ ఇచ్చే అవకాశం ఉంది.

రెనాల్ట్ ఖైగర్ ఫేస్​లిఫ్ట్: స్పెసిఫికేషన్స్..

పవర్​ట్రెయిన్ పరంగా, రెనాల్ట్ ఖైగర్ ఫేస్​లిఫ్ట్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఇంజిన్​లను నిలుపుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత మోడల్ రెండు సెట్ల ఇంజిన్​తో వస్తుంది. అవి.. 1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బోఛార్జ్​డ్ పెట్రోల్ ఇంజిన్.

1.0 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 71బీహెచ్​పీ పవర్, 96ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టర్బోఛార్జ్​డ్ ఇంజిన్ 98బీహెచ్​పీ పవర్, 160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. నేచురల్ ఆస్పిరేటెడ్ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్​మిషన్ (ఏఎంటీ)తో కనెక్ట్​ చేసి ఉంటుంది. టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్​బాక్స్ లేదా కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్​మిషన్ (సీవీటీ)తో వస్తుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం